P Venkatesh
Hyderabad Mega Job Fair: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రేపు హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ చేసుకోకండి.
Hyderabad Mega Job Fair: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రేపు హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ చేసుకోకండి.
P Venkatesh
ఎడ్యుకేషన్ పూర్తైందంటే చాలు నెక్ట్స్ ఏంటీ? అంటూ బంధువులు, స్నేహితులు ఊపిరాడనివ్వరు. ఇంకెంత కాలం ఖాళీగా ఉంటావంటూ ఇంట్లో వాళ్లు కూడా చివాట్లు పెడుతుంటారు. జాబ్ కోసం సెర్చ్ చేస్తేనేమో ఎక్కడ అవకాశం దొరకదు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేద్దామంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ దొరక్క, ఖాళీగా ఉండలేక సతమతమైపోతుంటారు నిరుద్యోగులు. మరి మీరు కూడా జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు గోల్డెన్ ఛాన్స్. రేపు హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పలు కంపెనీల్లో దాదాపు 16 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో ఆగస్టు 31న మెగా జాబ్ మేళా జరగనుంది. నగరంలోని మాసబ్ ట్యాంక్ ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో పలు కంపెనీలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ, బ్యాంకింగ్ ఇతర రంగాలలో దాదాపు 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నట్లు తెలుస్తున్నది. పదో తరగతి ఇంటర్, ఐటీఐ ఆపై చదివిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నవారు, ఎప్పటి నుంచో జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారు ఈ జాబ్ మేళాలో పాల్గొని జాబ్ పొందొచ్చు. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు కాబట్టి ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. కాబట్టి నిరుద్యోగులు ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోండి.