Dharani
Navodaya Vidyalaya Samiti: నవోదయ పాఠశాలలో భారీ ఎత్తున ఉపాధ్యాయుల పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయనున్నారు. ఆ వివరాలు..
Navodaya Vidyalaya Samiti: నవోదయ పాఠశాలలో భారీ ఎత్తున ఉపాధ్యాయుల పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయనున్నారు. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో ప్రైవేటు జాబ్ రావాలన్నా సరే.. పరీక్షకు హాజరు కావాల్సిందే. ఇక ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత చిన్నదైనా సరే గవర్నమెంట్ జాబ్ రావాలంటే.. కచ్చితంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.. మెరిట్ మార్కులు తెచ్చుకోవాలి. ఆ తర్వాత కొన్ని సార్లు ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. అన్ని వడపోతలు దాటితే.. ఉద్యోగం వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా పరీక్షలు నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఉద్యోగం పొందాలంటే పరీక్ష తప్పనిసరి అయిన నేటి కాలంలో.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా.. ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ లభించనుంది. నవోదయ పాఠశాలల్లో భారీ ఎత్తున టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే వీటికి ఎంపిక చేయనున్నారు. ఆ వివరాలు..
నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్).. భోపాల్ ప్రాంతీయ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 500 టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష లేకుండా.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 26 చివరితేది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.