iDreamPost
android-app
ios-app

జస్ట్ డిగ్రీ అర్హతతో ISROలో ఉద్యోగాలు! లైఫ్ సెటిల్ అయిపోయే ఛాన్స్!

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుండి భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలక్ట్ అయితే రూ. 30 వేల నుండి గౌరవ వేతనం లభించనుంది.

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుండి భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలక్ట్ అయితే రూ. 30 వేల నుండి గౌరవ వేతనం లభించనుంది.

జస్ట్ డిగ్రీ అర్హతతో ISROలో ఉద్యోగాలు! లైఫ్ సెటిల్ అయిపోయే ఛాన్స్!

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)విజయవంతంగా పలు ప్రయోగాలు చేపడుతోంది. కొన్ని ఓటములు ఎదురైన ఆత్మస్థైర్యంతో ముందగుడు వేస్తోంది. మంగళయాన్, చంద్రయాన్, ఆదిత్య యాన్ వంటివి సక్సెస్ ఫుల్‌గా చేపట్టింది. ఇప్పుడు గగన్ యాన్ చేపడుతోంది. దీని కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసిన సంగతి విదితమే. భాతర తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇది. 2024-25 మధ్య ప్రయోగం చేపట్టింది. ఇతర స్పేస్ ఏజెన్సీల కంటే తక్కువ ఖర్చుతో మిషన్లను పూర్తి చేస్తుంది. మరీ ఇలాంటి సంస్థల్లో ఉద్యోగాలు చేయాలంటే ఎలా అనుకుంటున్నారా..? అలాంటి వారికో అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది ఇస్రో.

నిరుద్యోగులకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తీపి కబురు చెప్పింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుండి భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 71 సైంటిస్ట్, ప్రాజెక్టు అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్ ఇస్రోలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలను అందిస్తుంది. ఇందులో సెలక్ట్ అయితే రూ. 31 వేల నుండి రూ. 56 వేల వరకు జీతాన్ని పొందవచ్చు. ఇందులో జాబ్ వస్తే.. లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. ఇక విద్యార్హత, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం.

సంస్థ: ISRO NRSC

మొత్తం పోస్టులు : 71

విద్యార్హత: ఎంఎస్, ఎంటెక్/ఎంఈ

ప్రాజెక్ట్ సైంటిస్ట్ -బి : బిటెక్/బీఈ (సీఎస్సీ)

వర్క్ ప్లేస్ : హైదరాబాద్, తెలంగాణ

అప్లికేషన్ చివరి తేదీ : 08-04-2024

వేతనం : రూ. 31 వేల నుండి రూ. 56, 100 వరకు

వయో పరిమితి: జూనియర్ రీసెర్ఛ్ ఫెలోషిప్/ రీసెర్చ్ సైంటిస్ట్: 28 ఏళ్లు మించరాదు

ప్రాజెక్ట్ సైంటిస్ట్/అసోసియేట్-1- 35 సంవత్సరాలకు మించరాదు

దరఖాస్తు విధానం : ఆన్ లైన్‌లో