భారతీయులకు బంపరాఫర్.. ఇజ్రాయెల్ లో 15 వేల ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం

Israel Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వందలు కాదు ఏకంగా 15 వేల ఉద్యోగాల భర్తీకి ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 2 లక్షల జీతం అందుకోవచ్చు.

Israel Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వందలు కాదు ఏకంగా 15 వేల ఉద్యోగాల భర్తీకి ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 2 లక్షల జీతం అందుకోవచ్చు.

చదువు పూర్తైన తర్వాత నెక్ట్స్ ఏం చేద్దాం.. అని ఆలోచిస్తుంటారు. ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్రెండ్స్ నెక్ట్స్ ఏంటీ అంటూ ప్రశ్నిస్తుంటారు. ఇంకా ఎంత కాలం ఖాళీగా ఉంటావు ఏదైనా పని చూసుకోవచ్చుగా అని సలహాలు ఇస్తుంటారు. తిని ఖాళీగా తిరుగుతున్నారని ఇంట్లో వాళ్లు తిట్లు, చివాట్లు పెడుతుంటారు. కాగా కొంతమంది నిరుద్యోగులు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి ఉపాధి పొందుతుంటారు. మరికొంతమంది జాబ్ కోసం వెతుకుతుంటారు. ఏదో ఒక చిన్న జాబ్ దొరికినా చాలు అని అనుకుంటుంటారు. జాబ్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ట్రై చేస్తుంటారు. ఉద్యోగం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు.

కొంతమంది ఏళ్ల తరబడి జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని పట్టువదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. మరి మీరు కూడా జాబ్ సెర్చ్ లో ఉన్నారా? ఉద్యోగం లేదని వర్రీ అవుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. 15 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా నెలకు రూ. 2 లక్షల జీతం అందుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగావకాశాలు మనదగ్గర కాదండోయ్ ఇజ్రాయెల్ లో. భారత్ నుంచి వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. మీరు పదో తరగతి పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ జాబ్స్ కోసం ట్రై చేయొచ్చు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంవత్సరకాలంగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఇరు దేశాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక హమాస్ తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లో మానవవనరుల కొరత ఏర్పడింది. దీంతో విదేశాల నుంచి కార్మికులను ఆహ్వానిస్తోంది. దీనిలో భాగంగా వేలాది మంది కార్మికులను నియమించుకునేందుకు భారత్‌ను ఇటీవల సంప్రదించిందని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్ ఎస్డీసీ) పేర్కొంది. ఫ్రేమ్‌వర్క్‌, ఐరన్‌ బెండింగ్‌, ప్లాస్టరింగ్‌, సిరామిక్‌ టైలింగ్‌ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఇజ్రాయఏల్‌కు చెందిన పాపులేషన్‌, ఇమ్మిగ్రేషన్‌, బోర్డర్‌ అథారటీ (పీఐబీఏ) ఇటీవల తమను సంప్రదించిందని తెలిపింది.

ఇజ్రాయెల్ నియమించుకోనున్న పోస్టుల్లో 10వేల నిర్మాణ కార్మికులు, ఐదు వేల ఆరోగ్య సంరక్షకుల ఉద్యోగాలు కలుపుకుని మొత్తం 15 వేల పోస్టులు ఉన్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా స్కిల్‌ టెస్ట్‌ నిర్వహణ కోసం మరికొన్ని వారాల్లోనే పీఐబీఏ బృందం భారత్‌కు రానుందని పేర్కొంది. మహారాష్ట్రలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఎన్ఎస్డీసీ వివరించింది. ఎంపికైన వారికి నెలకు రూ.1.92 లక్షల వేతనంతో పాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారని చెప్పింది. దీంతో పాటు రూ.16,515 బోనస్‌ కూడా అందించనున్నట్లు వెల్లడించింది. పదో తరగతి పాసై, కేర్‌గివింగ్ కోర్సు పూర్తి చేసి కనీసం 990 గంటల పాటు సంబంధిత విభాగంలో శిక్షణ పొందిన వారు ఈ ఉద్యోగానికి అర్హులని ఎన్‌ఎస్డీసీ వెల్లడించింది.

Show comments