iDreamPost
android-app
ios-app

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..

  • Published Jul 19, 2024 | 9:09 PM Updated Updated Jul 19, 2024 | 9:09 PM

Infosys Company Says Good News To Engineering Students: ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కాలేజీల్లో ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ ని నిర్వహిస్తామని తెలిపింది. మొత్తం ఎంతమందిని నియమించుకోనుందంటే?

Infosys Company Says Good News To Engineering Students: ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కాలేజీల్లో ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ ని నిర్వహిస్తామని తెలిపింది. మొత్తం ఎంతమందిని నియమించుకోనుందంటే?

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..

ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 వేల నుంచి 20 వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని తీసుకుంటామని ప్రకటించింది. ఫ్రెషర్స్ కోసం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ని నిర్వహించనున్నట్లు ఇన్ఫోసిస్ కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి ఇన్ఫోసిస్ లో మొత్తం 3,15,332 మంది ఉద్యోగులు ఉండగా.. తాజాగా ఈ సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. 2 వేల మంది కంపెనీ నుంచి బయటకు వెళ్లడంతో జూన్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 3,15,332కి చేరింది. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ సంఖ్య బాగా తగ్గింది. ఈ ఏడాది ఏకంగా 20,962 మంది ఉద్యోగులు తగ్గారు.

ఈ క్రమంలో కొత్తగా వచ్చే గ్రాడ్యుయేట్స్ ని 15 వేల మంది నుంచి 20 వేల మంది వరకూ తీసుకునేందుకు చూస్తున్నామని కంపెనీ తెలిపింది. తాము చూసే ఎదుగుదలను బట్టి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకుంటామని వెల్లడించింది. 85 శాతం ఉద్యోగులు ఉన్నారని.. ఇంకా మిగిలి ఉన్న ఖాళీలను ఫిల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. మేము వృద్ధిని చూడడం ప్రారంభించినప్పుడు నియామకాలను పరిశీలిస్తామని ఇన్ఫోసిస్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్కా అన్నారు. గత కొన్ని త్రైమాసికాల్లో ఇన్ఫోసిస్ కంపెనీ చురుకైన నియామకానికి చేరిందని అన్నారు.

ఫ్రెషర్స్ ని తీసుకుంటామని ఇన్ఫోసిస్ ప్రకటించిన తాజా ప్రకటనతో.. ఇటీవల చదువు పూర్తి చేసిన ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ కి, అలానే చదువు పూర్తై ఐటీ ఉద్యోగాలు దొరక్క ఆశగా ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఒక భరోసా వచ్చింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2025 ఆర్థిక సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్స్ ని నియమించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే మొదటి త్రైమాసికంలో 11 వేల మంది ట్రైనీలను తీసుకున్నారు. అయితే ఈ మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కంపెనీలో 1908 మంది ఉద్యోగులు తగ్గారు. దీనికి విరుద్ధంగా టీసీఎస్ కంపెనీ మాత్రం నికర మొత్తంలో 5,452 మంది ఉద్యోగులను నియమించుకుంది. మార్చి పీరియడ్ తో పోలిస్తే టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 1759 కి పడిపోయింది. హెచ్సీఎల్ కూడా మొదటి త్రైమాసికంలో 8080 ఉద్యోగుల తగ్గుదలతో క్షీణతను చూసింది. దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల క్షీణతను చూస్తున్న క్రమంలో ఇన్ఫోసిస్ కంపెనీ 15 వేల నుంచి 20 వేల ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధపడుతుంది.