Dharani
మీరు పదో తరగతి పాస్ అయ్యారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..
మీరు పదో తరగతి పాస్ అయ్యారా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..
Dharani
మంచి జీతం రావాలి.. ఉద్యోగ భద్రత ఉండాలి అనగానే అందరికి గుర్తుకు వచ్చేది గవర్నమెంట్ జాబే. అవును చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు.. లైఫ్ సెటిల్ అయిపోద్ది అని భావించే వారు ఎందరో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రారంభంలో జీతం తక్కువైనా.. సౌకర్యాలు ఎక్కువ. పోను పోను వేతనం కూడా భారీగా పెరుగుతుంది. అన్నింటికి మించి ఎప్పుడు ఎవరు ఉద్యోగం నుంచి తొలగిస్తారో అనే భయం ఉండదు. అందుకే చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే ప్రయత్నాల్లో ఉంటారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుతుంటారు.
అయితే అందరికి గవర్నమెంట్ జాబ్ అంటే కష్టం. హార్డ్‌వర్క్‌తో పాటు కాస్తో కూస్తో లక్కు కూడా ఉండాలి. ఇక నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే కచ్చితంగా పరీక్షలో మెరిట్ సాధించాలి. అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు సెలక్ట్ చేస్తారు. ఈ తరహా జాబ్‌లు ఎక్కువగా పోస్టల్ శాఖలో ఉంటాయి. అలాంటి ఓ జాబ్ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే యువతకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ శుభవార్త చెప్పింది. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటి భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేస్తారు. అయితే ఈ ఖాళీలన్నీ కర్ణాటక ప్రాంతానికి చెందినవి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ మే 14, 2024.
ఇండియా పోస్ట్ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలు భర్తీ చేస్తారు. ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి.