nagidream
India Post Recruitment 2024: మీరు పదో తరగతి పాసయ్యారా? మంచి జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. ఇండియా పోస్ట్ లో ఉన్న ఖాళీల భర్తీ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.
India Post Recruitment 2024: మీరు పదో తరగతి పాసయ్యారా? మంచి జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. ఇండియా పోస్ట్ లో ఉన్న ఖాళీల భర్తీ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.
nagidream
టెన్త్ క్లాస్, ఇంటర్ క్వాలిఫికేషన్ తో యాభై, 60 వేల జీతం రాదు అని కామెంట్స్ చేసేవారికి ఈ ప్రభుత్వ ఉద్యోగంతో సమాధానం చెప్పండి. మీరు పదో తరగతి పాసైతే గనుక ఈ ప్రభుత్వ ఉద్యోగం మీకోసమే. పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల లేదా ఇంకేదైనా కారణాల వల్ల పదవ తరగతిలో చదువు ఆపేసి సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసం ఎదురుచూస్తుంది. ప్రభుత్వ చేయాలన్న తపన మీలో ఉంటే ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి.
భారత ప్రభుత్వానికి చెందిన కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కి చెందిన ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టును రిక్రూట్ చేసేందుకు ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ సిద్ధమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులను ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవాలని ఇండియా పోస్ట్ సూచించింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఇండియా పోస్ట్ వెల్లడించింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి లేదా సంస్థ నుంచి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు మోటార్ మెకానిజంపై అవగాహన కలిగి ఉండాలి.
మోటార్ కార్ డ్రైవింగ్ లో కనీసం మూడేళ్లు అనుభవం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. హోంగార్డుగా గానీ సివిల్ వాలంటీర్ గా గానీ మూడు సంవత్సరాలు సేవ చేసిన అనుభవాన్ని ఆశిస్తున్నారు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 56 ఏళ్ళు ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థి.. లెవల్ 2 కింద నెలకు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు జీతం పొందుతారు. ఆర్డినరీ గ్రేడ్ కింద స్టాఫ్ డ్రైవర్ పోస్టులు రెండు ఖాళీలు ఉన్నట్లు ఇండియా పోస్ట్ తెలిపింది. జనరల్ సెంట్రల్ సర్వీస్ (గ్రూప్ సీ) నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ క్లాసిఫికేషన్ కింద ఈ పోస్టులను భర్తీ చేయనుంది. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.