Dharani
India Post GDS Recruitment 2024: సుమారు 45 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ రోజే అనగా ఆగస్టు 5 ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేది. ఇంకా అప్లై చేయకపోతే త్వరపడండి..
India Post GDS Recruitment 2024: సుమారు 45 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ రోజే అనగా ఆగస్టు 5 ఆ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేది. ఇంకా అప్లై చేయకపోతే త్వరపడండి..
Dharani
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి కీలక అప్డేట్.. కేంద్ర ప్రభుత్వం సుమారు 45 వేల ఉద్యోగాల భర్తీకి గత నెల అనగా జూలైలో నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే వీటిని భర్తీ చేయనుంది. ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది నిరుద్యోగులకు పండగలాంటి వార్తే అని చెప్పవచ్చు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. ఈ అవకాశాన్ని వదులుకోకండి. పైగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఇవాళే అనగా ఆగస్టు 5 చివరి తేదీ. మరి మీరు కనక ఇంకా అప్లై చేయకపోతే త్వరపడండి. ఇంతకు ఇవి దేనికి సంబంధించిన పోస్టులు.. ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలనే వివరాలు మీ కోసం..
ఇండియా పోస్ట్ డాక్ సేవక్ 2024 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఆగస్టు 5న నాటికి వీటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. మరి మీరు ఇంకా అప్లై చేయకపోతే.. త్వరపడండి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని భావించే వారు.. indiapostgdsonline.gov.in అధికారిక వెబ్సైట్లో డైరెక్ట్ లింక్ని పొందొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జూలై 15న ప్రారంభమైన విషయం తెలిసిందే. కరెక్షన్ విండో ఆగస్టు 6న ప్రారంభమై ఆగస్టు 8, 2024న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా పోస్టాఫీసుల్లో సుమారు 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు.
జీడీఎస్ కోసం విద్యార్హత 10వ తరగతి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ అవసరం. అభ్యర్థి కచ్చితంగా గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో పాస్ కావాలి.
అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 40 ఏళ్లకు మించకూడదు. అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ఏజ్ లిమిట్‌లో సడలింపు ఇచ్చారు.
జీడీఎస్ రిక్రూట్మెంట్ దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. పదో తరగతిలో సాధించిన మార్కులు / గ్రేడ్లు / పాయింట్ల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ని చూడవచ్చు.