Dharani
India Post GDS Recruitment 2024: పదో తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇండియన్ పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. సుమారు 44 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..
India Post GDS Recruitment 2024: పదో తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇండియన్ పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. సుమారు 44 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..
Dharani
పదో తరగతి పాస్ అయ్యారా.. ప్రభుత్వం ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. పోస్టాఫీసులో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. సుమారు 44 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ప్రతి ఏటా వేల సంఖ్యలో.. గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా భారీ ఎత్తున జీడీఎస్ కొలువుల భర్తీకి పోస్టల్ శాఖ సన్నాహాలు చేస్తుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో.. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 44,228 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వుల జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జీడీఎస్ లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం) లేదా డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పదో తరగతి పాస్ అయ్యి ఉండి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని భావించే వారికి ఇదో సువర‍్ణావకాశం అని చెప్పవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని భావించే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈపోస్టులకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5, 2024.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 12 వేల12,000/- నుంచి రూ.29,380/- వరకు వేతనం చెల్లిస్తారు. అలానే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి సెలక్ట్ అయిన అభ్యర్థికి నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు జీతంగా ఇస్తారు. రోజుకు కేవలం 4 గంటలు పని చేస్తే చాలు.