Dharani
HLL Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పైగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. ఆ వివరాలు..
HLL Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పైగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. ఆ వివరాలు..
Dharani
దేశంలో నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినా.. దానికి లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. ఉద్యోగాల సంఖ్య వందలు, వేలల్లో ఉంటే.. పోటీ పడే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రభుత్వ రంగ సంస్థ.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. మరి మీరు కూడా ఇలాంటి అవకాశం కోసం చూస్తున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లై చేసుకొండి. ఇంతకు ఏ ప్రభుత్వ సంస్థలో ఈ ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.. జీతం ఎంతిస్తారు.. ఎలా అప్లై చేసుకోవాలి అంటే..
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సంస్థ కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, ఐయూడీ, సర్జికల్ సూచర్స్, బ్లడ్ బ్యాగ్స్, ఫార్మా ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా 1217 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అకౌంట్స్ ఆఫీసర్, అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అడ్మిన్ అసిస్టెంట్, సెంటర్ మేనేజర్ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు.. సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.lifecarehll.com/ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు జులై 17న ముగుస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
లేటెస్ట్ నోటిఫికేషన్‌తో ఈ సంస్థ మొత్తం 1,217 ఖాళీలను భర్తీ చేస్తుంది. అందులో అకౌంట్స్ ఆఫీసర్-2, అడ్మిన్ అసిస్టెంట్-1, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్-1, సెంటర్ మేనేజర్-4, సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్- 1206 పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి.
సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్స్‌కు జీతం నెలకు రూ. 14,000 నుంచి రూ.32,500 మధ్య లభిస్తుంది. అడ్మిన్ అసిస్టెంట్, అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సెంటర్ మేనేజర్ పోస్ట్‌లకు రూ. 12,000 నుంచి రూ.29,500 మధ్య జీతం ఉంటుంది.
ముందుగా హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ అధికారిక పోర్టల్ https://www.lifecarehll.com/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 37 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపికయ్యే అభ్యర్థులు ఫిక్స్‌డ్-టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం కేరళ, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ బ్రాంచ్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది.