iDreamPost

B.Tech అర్హతతో ECILలో 363 ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేసుకోండి!

మీరు డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకిదే మంచి అవకాశం. ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మీరు డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకిదే మంచి అవకాశం. ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

B.Tech అర్హతతో ECILలో 363 ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేసుకోండి!

ప్రస్తుత కాలంలో చదువుకు ప్రాధాన్యత పెరిగింది. విద్య నేర్చుకుంటే పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పిల్లలను ఎంత కష్టమైనా సరే ఉన్నత చదువులు చదివించడానికి మొగ్గుచూపుతున్నారు. వారు భాగా చదువుకుని ప్రయోజకులై ఉన్నత ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో యువతకు తమ తల్లిదండ్రుల కలల్ని నిజం చేసే అవకాశం వచ్చింది. బీటెక్ అర్హతతో ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈసీఐఎల్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీను భర్తీ చేయనున్నది. మొత్తం 363 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది ఈసీఐఎల్. డిప్లొమా, బీఈ, బీటెక్ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఈసీఐఎల్ అధికారిక వెబ్ సైట్ https://www.ecil.co.in/ ను పరిశీలించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

ఈసీఐఎల్ మొత్తం అప్రెంటిస్ ఖాళీలు:

  • 363

విభాగాల వారీగా పోస్టులు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:

  • 250

టెక్నీషియన్ అప్రెంటిస్:

  • 113

అర్హత:

  • అభ్యర్థులు మెకానికల్/సివిల్/కంప్యూటర్/ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా, బీఈ, బీటెక్, ఉత్తీర్ణులైన వారు అర్హులు.

వయసు:

  • అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9 వేలు చెల్లిస్తారు. టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం ఎంపికైన వారికి రూ. 8 వేలు అందిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • అభ్యర్థులందరికీ అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 06-12-2023

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 15-12-2023

అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి