Dharani
మీకు పోలీసు ఉద్యోగం అంటే ఇష్టమా.. అయితే భారీ వేతనంతో ఖాకీ జాబ్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..
మీకు పోలీసు ఉద్యోగం అంటే ఇష్టమా.. అయితే భారీ వేతనంతో ఖాకీ జాబ్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..
Dharani
యువతలో చాలా మందికి పోలీసు ఉద్యోగమంటే ఎంతో ఇష్టం. కనీసం కానిస్టేబుల్ పోస్ట్ అయినా సాధించి.. ఒంటి మీద ఖాకీ డ్రెస్సు ధరించాలని ఉబలాటపడతారు. మరీ మీకు కూడా ఇలానే పోలీసు ఉద్యోగమంటే ఇష‍్టమా.. అయితే మీ కోసమే కేంద్ర ప్రభుత్వం భారీ జీతంతో యూనిఫామ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా లక్ష 77 వేల జీతంతో పోలీస్ జాబ్ పొందే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
కేంద్ర సాయుధ బలగాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) ఒకటి. దేశ సరిహదుల్లో గస్తీ చేపట్టడం బీఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రధాన విధి. కేంద్ర, రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్స్‌లో క్వాలిఫై అవ్వని వారు డిపార్ట్‌మెంట్ జాబ్ కోసం ఈ సంస్థలో చేరవచ్చు. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) ఎగ్జామ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షతో బీఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్-ఏ) ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఈ నోటిషికేషన్ ద్వారా యూపీఎస్సీ మొత్తం 186 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి అప్లై చేసుకోవడానికి మే 14 చివరి తేదీ. అర్హులైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక పోర్టల్ upsc.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
కాగా, యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు బీఎస్‌ఎఫ్‌లో 186 భర్తీ చేయడంతో పాటు ఇతర ఫోర్సెస్ సీఆర్‌పీఎఫ్‌లో-120, సీఐఎస్‌ఎఫ్-100, ఐటీబీపీ-58, ఎస్‌ఎస్‌బీలో 42 అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీలను భర్తీ చేస్తోంది.