ఇలాంటి జాబ్ కొడితే లైఫ్ సెట్.. నెలకు 2 లక్షల జీతంతో ISROలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ISRO recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఇస్రోలో భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ISRO recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఇస్రోలో భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఏ పనీ చేయకుండా ఉంటే ఎంతో కష్టంగా ఉంటుంది. చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. చేస్తున్న పని చిన్నదా, పెద్దదా అని చూడకూడదు. బిజినెస్, ఉద్యోగం ఏదైనా సరే డెడికేషన్ ఉండాలి. లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుంది. నేటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు హెవీ కాంపిటీషన్ ఉంది. ప్రైవేట్ సెక్టార్ లో కూడా జాబ్ సాధించడం గగనమైపోయింది. దీంతో ఉద్యోగాల్లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. చిన్న జాబ్ దొరికినా చాలని భావిస్తున్నారు. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. భారీ వేతనంతో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది.

నెలకు 2 లక్షల వేతనంతో ఇస్రోలో జాబ్ కొట్టే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పోస్టులకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో మొత్తం 103 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మెడికల్ ఆఫీసర్-ఎస్డీ, మెడికల్ ఆఫీసర్-ఎస్సీ, సైంటిస్ట్ ఇంజినీర్-ఎస్సీ, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్‌మెన్‌-బీ, అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) వంటి తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపధికన భర్తీ చేస్తున్నప్పటికీ, పర్ఫార్మెన్స్‌ ఆధారంగా అభ్యర్థులను పర్మినెంట్‌ ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి చూసినట్లైతే మెడికల్ ఆఫీసర్ (ఎస్డీ) పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్లు, సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్సీ) పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 35 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 35 ఏళ్లు, టెక్నీషియన్ (బి) పోస్టుకు 18 నుంచి 35 ఏళ్లు, డ్రాఫ్ట్స్ మెన్ (బి) పోస్టుకు 18 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ (అధికారిక భాష) పోస్టుకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి 21, వేల 700 నుంచి 2 లక్షల 8 వేల 700 మధ్య వేతనం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే, ప్రాసెసింగ్‌ ఫీజు కింద అదనంగా రూ. 750 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ. 500) చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని పరీక్షలకు హాజరైన వారికి రీఫండ్‌ చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 9 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం isro.gov.in ను సంప్రదించాల్సి ఉంటుంది.

Show comments