10th పాసై ఖాళీగా ఉన్నారా?.. Navyలో జాబ్ కొట్టి హీరో అవ్వండి.. నెలకు రూ. 63 వేల జీతం

Indian Navy Chargeman INCET 01/2024 Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. పదో తరగతి అర్హతతోనే జాబ్ పొందొచ్చు.

Indian Navy Chargeman INCET 01/2024 Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. పదో తరగతి అర్హతతోనే జాబ్ పొందొచ్చు.

భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇదే మంచి ఛాన్స్. సాధారణంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తవగానే ఉద్యోగం చూసుకోమ్మని ఇంట్లో వాళ్లు చెబుతుంటారు. కానీ గవర్నమెంట్ జాబ్స్ కు కాంపిటీషన్ ఎక్కువ. కుటుంబ సభ్యులు ఇంకా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావు అంటూ అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇదే సరైన సమయం. ఇండియన్ నేవీలో జాబ్ కొట్టి హీరో అయిపోవచ్చు. ఇండియన్ నేవీ- సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఐఎన్‌సెట్‌-01/ 2024) కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఇండియన్ నేవీ గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో మొత్తం 741 పోస్టులను భర్తీచేయనున్నది. ఈ పోస్టుల్లో ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 02 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్‌-01/ 2024)

పోస్టుల సంఖ్య: 741

విభాగాల వారీగా ఖాళీలు:

I. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్

  • ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్): 01
  • ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ): 10
  • ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్): 18
  • సైంటిఫిక్ అసిస్టెంట్: 04

II. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్, నాన్-ఇండస్ట్రియల్

  • డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌): 02
  • ఫైర్‌మ్యాన్: 444
  • ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 58
  • ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 161
  • పెస్ట్ కంట్రోల్ వర్కర్: 18
  • కుక్: 09
  • ఎంటీఎస్‌ (మినిస్టీరియల్): 16

అర్హత:

  • పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి 18-30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.295 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • అప్లికేషన్‌ స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి 18 నుంచి 63 వేలు, కొన్నిపోస్టులకు లక్ష వరకు జీతం పొందొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 20-07-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 02-08-2024
Show comments