బ్యాంక్ జాబ్ కావాలా?.. ఏడాదికి రూ. 6 లక్షల జీతంతో Bank Jobs రెడీ

IDBI Bank JAM Recruitment 2024: బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఏడాదికి 6 లక్షల జీతంతో ఐడీబీఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

IDBI Bank JAM Recruitment 2024: బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఏడాదికి 6 లక్షల జీతంతో ఐడీబీఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా స్కిల్స్ లేక చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కంపెనీలు ఆఫర్ చేసే జాబ్ రోల్ కి సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. దీంతో నిరుద్యోగం ఎక్కువైపోతున్నది. అటు ప్రైవేట్ సెక్టార్.. ఇటు గవర్నమెంట్ సెక్టార్ లలో కాంపిటీషన్ హెవీగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసే ఉద్యోగాలకు లక్షలాది మంది పోటీపడుతున్నారు. ఇక ఇవే కాక బ్యాంక్ ఉద్యోగాలకు ట్రై చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వేలది మంది బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. కోచింగ్ సెంటర్లలో చేరి పుస్తకాలతో ఓ యుద్ధమే చేస్తుంటారు. జాబ్ కొట్టడమే లక్ష్యంగా రేయింభవళ్లు కష్టపడి సన్నద్ధమవుతుంటారు.

ఐటీ జాబ్స్ కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో బ్యాంక్ జాబ్స్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. పక్కా ప్రణాళికతో చదివితే తప్పా బ్యాంక్ జాబ్ సాధించడం సాధ్యం కాదు. మరి మీరు కూడా బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఐడీబీఐ బ్యాంక్ భారీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 600 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోదలిచిన వారు గ్రేడ్ ఒ- జనరల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.. గ్రేడ్ ఒ- స్పెషలిస్ట్ పోస్టులకు బీఎస్సీ లేదా బీటెక్‌ లేదా బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఈపోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఇతరులు రూ.1050 చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ లో నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ www.idbibank.inను సందర్శించాల్సి ఉంటుంది.

Show comments