ESICలో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం 2 లక్షలు.. ఈ అర్హతలుంటే చాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 2 లక్షలు అందుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 2 లక్షలు అందుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారికి లైఫ్ సెట్ అయ్యే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ లక్కీ ఛాన్స్ ను అస్సలు వదులుకోకండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 2 లక్షల వరకు జీతం అందుకోవచ్చు. మంచి వేతనంతో పాటు లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 106 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఇంటర్య్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ, ఈపీఎఫ్‌వో పరిధిలో పనిచేసే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 106 ఖాళీలను భర్తీ చేయనుంది. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్న ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌లో టీచింగ్ స్టాఫ్, ఇతర పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌తో భర్తీ చేస్తారు. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్‌ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఎంబీబీఎస్, మెడికల్ పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జూన్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య:

  • 106

విభాగాల వారీగా ఖాళీలు:

  • 34 సూపర్ స్పెషలిస్ట్ పోస్టులు, 30 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, 21 అసోసియేట్ ప్రొఫెసర్, 12 సీనియర్ రెసిడెంట్, 9 ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

అర్హత:

  • అభ్యర్థులు ఎంబీబీఎస్, మెడికల్ పీజీ ఉత్తీర్ణులైన ఉండాలి.

వయో పరిమితి:

  • ఈఎస్ఐసీలో ఫ్యాకల్టీ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 67 సంవత్సరాలుగా నిర్ణయించారు. సూపర్ స్పెషలిస్ట్ రెగ్యులర్/పార్ట్ టైమ్ పోస్టులకు 67 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ 45 సంవత్సరాలుగా ఉంది.

అప్లికేషన్ ఫీజు:

  • అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ. 225 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఈఎస్ఐసీ (రెగ్యులర్ స్టాఫ్), మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులు, శారీరక వికలాంగ అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు.

ఎంపిక విధానం:

  • అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలు ‘అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అల్వార్, రాజస్థాన్, 301030’ అడ్రస్‌లో జరుగుతాయి. ఇక్కడ జూన్ 4న ఉదయం 9 గంటలకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదే రోజు ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

వేతనం:

  • ప్రొఫెసర్ పోస్టులకు 2,01,213, అసోసియేట్ ప్రొఫెసర్ రూ. 1,33,802, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ. 1,14,955, సూపర్ స్పెషలిస్టు (ఫుల్ టైమ్) రూ. 200000, సూపర్ స్పెషలిస్టు (పార్ట్ టైమ్) 100000 జీతంగా చెల్లిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 04-06-2024
Show comments