సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. LLB కూడా అవసరం లేదు.. నెలకు 46 వేల జీతం

Supreme Court of India Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ అందించింది. పలు జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నెలకు 46 వేల జీతం పొందొచ్చు.

Supreme Court of India Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ అందించింది. పలు జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నెలకు 46 వేల జీతం పొందొచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సాధారణంగా కోర్టు ఉద్యోగాలంటే లా డిగ్రీ ఉండాలనుకుంటారు. కానీ ఈ జాబ్స్ కు మాత్రం ఎల్ఎల్బీ అవసరం లేదు. ఈ జాబ్స్ కు ఎంపికైతే నెలకు రూ. 46210 జీతం పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారు ఈ అవకాశాన్ని వదులుకోకండి. మరి ఈ జాబ్స్ కు అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? ఆ వివరాలు మీకోసం.

సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 80 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు కుకింగ్/ కులినరీ లో వన్ ఇయర్ డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.46,210 చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం :

మొత్తం పోస్టులు: 80

అర్హత:

  • పదో తరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.46,210 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌

దరఖాస్తు ఫీజు:

  • రూ.400; ఎస్సీ/ ఎస్టీ / ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / మహిళా/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 12-09-2024
Show comments