సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో.. 1,130 కానిస్టేబుల్ ఫైర్‌మెన్ జాబ్స్.. ఆలస్యం చేయకండి

CISF Constable Fire 2024: గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1,130 కానిస్టేబుల్ ఫైర్‌మెన్ జాబ్స్ రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

CISF Constable Fire 2024: గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1,130 కానిస్టేబుల్ ఫైర్‌మెన్ జాబ్స్ రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

పోలీస్ జాబ్స్ కు యూత్ లో యమ క్రేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కలలుకంటుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రిలీజ్ అయ్యే పోలీస్ జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మరి మీరు ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీకు పోలీస్ జాబ్ సాధించడమే లక్ష్యమైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ ఫైర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

సీఐఎస్ఎఫ్ 1,130 కానిస్టేబుల్ ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి సైన్స్ సబ్జెక్ట్ తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18-23 సంవత్సరాలు కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ల కు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 21,700 నుంచి 69,100 అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంర్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం కానిస్టేబుల్ ఫైర్‌మెన్ పోస్టులు:

  • 1,130

అర్హత:

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి సైన్స్ సబ్జెక్ట్ తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 18-23 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 21,700 నుంచి 69,100 అందుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 31-08-2024

దరఖాస్తు చివరి తేదీ:

  • 30-09-2024
Show comments