iDreamPost
android-app
ios-app

ఒక్క నిమిషంలో 183 మందికి ఇంటర్వ్యూ పూర్తి! ఈ బాస్ ట్రిక్ ఇప్పుడు వైరల్!

  • Published Mar 15, 2024 | 5:29 PM Updated Updated Mar 15, 2024 | 5:29 PM

ప్రస్తుతం ఉద్యోగాల రేసులో యువత ఒకరితో ఒకరు బాగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ కంపెనీలో 183 మంది ఉద్యోగానికి అప్లై చేయగా.. కనీసం వారిని ఇంటర్వ్యూ కూడా చేయకుండానే.. వారిలో 177మందిని రిజెక్ట్ చేసేసింది. దానికి కారణం తెలిస్తే అందరు ఆశ్చర్య పోవాల్సిందే.

ప్రస్తుతం ఉద్యోగాల రేసులో యువత ఒకరితో ఒకరు బాగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ కంపెనీలో 183 మంది ఉద్యోగానికి అప్లై చేయగా.. కనీసం వారిని ఇంటర్వ్యూ కూడా చేయకుండానే.. వారిలో 177మందిని రిజెక్ట్ చేసేసింది. దానికి కారణం తెలిస్తే అందరు ఆశ్చర్య పోవాల్సిందే.

  • Published Mar 15, 2024 | 5:29 PMUpdated Mar 15, 2024 | 5:29 PM
ఒక్క నిమిషంలో 183 మందికి ఇంటర్వ్యూ పూర్తి! ఈ బాస్ ట్రిక్ ఇప్పుడు వైరల్!

సాధారణంగా ఓ వ్యక్తి ఉద్యోగం సాధించాలంటే .. ముందుగా ఆ వ్యక్తి ఏ ఏ కంపెనీలలో అయితే ఓపెనింగ్స్ ఉన్నాయో చూసుకుని.. ఆయా కంపెనీలకు రెస్యూమ్స్ సెండ్ చేస్తూ.. వాటికీ తగిన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను ఆ ఇంటర్వ్యూను ఫేస్ చేసే దానిని బట్టి.. ఆ ఉద్యోగంలో అతను సెలెక్ట్ అవుతాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా ఒక్క ఉద్యోగం కోసం ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసేవాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఏటా లక్షల్లో ఉద్యోగాలకు ఓపెనింగ్స్ వస్తుంటే.. వేలలో రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ యూకే కంపెనీ వారి సంస్థలో వెకెన్సీసీ ఉన్నాయని ఓ ప్రకటన ఇచ్చింది. ఇక ఆ ప్రకటన చూసి 183 మంది ఎంతో ఆసక్తిగా ఆ ఉద్యోగానికి అప్లై చేశారు. కానీ, కనీసం వారిని ఇంటర్వ్యూ చేయకుండానే ఆ సంస్థ యాజమాన్యం ఆ 183 మందిలో 177 మంది అప్లికేషన్స్ ను రిజెక్ట్ చేసేసింది. దానికి కారణం తెలిస్తే అందరు షాక్ అవ్వాల్సిందే.

ఏదైనా ఒక కంపెనీలో రిక్రూట్మెంట్ జరుగుతోంది అంటే.. జనరల్ గా దానికి సంబంధించిన అప్లికేషన్స్ రిలీజ్ చేసినపుడు.. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్కిల్స్ , ఎక్స్పీరియన్స్ ఇలా కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమని అడగడం కామన్. ఇక వారు అడిగిన డీటెయిల్స్ ను ఫిల్ చేసి.. తగిన స్కిల్స్ ఉంటే.. ఆ కంపెనీ వారు పెట్టే టెస్ట్స్ అండ్ ఇంటర్వూస్ ని బేస్ చేసుకుని.. ఆ వ్యక్తి రిసల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ సహజంగా జరిగేవే కానీ, యూకే కి చెందిన ఓ ప్రముఖ సంస్థ RIవెబ్ మాత్రం.. వారి కంపెనీలో రిక్రూట్మెంట్ కోసం అప్లికేషన్స్ తో పాటు.. వాటికి కొన్ని సింపుల్ అండ్ లాజికల్ ప్రశ్నలను జత చేసింది. ఈ కంపెనీకి 183 మంది అప్లై చేశారు. కానీ, కంపెనీ మాత్రం అసలు ఏ ఇంటర్వ్యూ చేయకుండానే .. కేవలం అప్లికేషన్స్ చూసి వారిలో 177మందిని రిజెక్ట్ చేసేసింది. దానికి కారణం ఆ 177 మంది కంపెనీ అప్లికేషన్స్ తో పాటు జత చేసిన ప్రశ్నలను.. సరిగా పట్టించుకోకపోవడమే. మిగిలిన ఆరుగురు ఆ ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్ గా ఫిల్ చేయడంతో..కేవలం ఆ ప్రొఫైల్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంది.

183 177 people rejected the job

ఈ విషయాన్నీ ఆ కంపెనీ యాజమాన్యం వెల్లడిస్తూ .. స్కిల్స్ అన్నీ మ్యాచ్ అయినా .. మిగిలిన అప్లికేషన్స్ ను రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని తెలియజేసింది. కేవలం దరఖాస్తు దారులు .. కంపెనీ వారు ఇచ్చిన ప్రశ్నలను సరిగా పట్టించుకోకపోవడమే దీనికి కారణం అని .. ఆ సంస్థ తెలియజేసింది. కాబట్టి ఎప్పుడైనా సరే .. ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసేటపుడు ఆయా కంపెనీస్ ఇచ్చే ప్రకటనలను కంప్లీట్ గా చదివి అర్థంచేసుకోవాలని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం చాలా మంది ఎలా అయినా ఉద్యోగాన్ని సంపాదించాలి అనే ఆరాటంలో.. కేవలం కనిపించిన జాబ్ కు అప్లై చేయడమే కానీ.. వారు ఇచ్చే పూర్తి డీటెయిల్స్ ను చదవడానికి టైమ్ తీసుకోవడం లేదు. మరో వైపు కంపెనీస్ తమ పనిని సులువు చేసుకునేందుకు.. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ను ఉపయోగిస్తూ ఉంది. కాబట్టి, ఎవరైతే ఉద్యోగానికి అప్లై చేసుకునేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ చదవకుండా.. అప్లై చేస్తున్నారో.. అటువంటి వారందరికీ RIవెబ్ సంస్థ ద్వారా హెచ్చరించినట్లు అయింది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.