iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క దానికి మాత్రమే నేను భయపడతా! RCB క్యాంపులో కోహ్లీ ఓపెన్!

  • Published Apr 10, 2024 | 6:08 PM Updated Updated Apr 10, 2024 | 6:08 PM

virat Kohli Biggest Fear: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. కానీ, కోహ్లీ మాత్రం టీమ్ భారాన్ని తన భుజాన వేసుకుని మోస్తున్నాడు. అయితే కోహ్లీకి అతి పెద్ భయం ఏంటో వెల్లడించాడు.

virat Kohli Biggest Fear: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. కానీ, కోహ్లీ మాత్రం టీమ్ భారాన్ని తన భుజాన వేసుకుని మోస్తున్నాడు. అయితే కోహ్లీకి అతి పెద్ భయం ఏంటో వెల్లడించాడు.

  • Published Apr 10, 2024 | 6:08 PMUpdated Apr 10, 2024 | 6:08 PM
ఆ ఒక్క దానికి మాత్రమే నేను భయపడతా! RCB క్యాంపులో కోహ్లీ ఓపెన్!

విరాట్ కోహ్లీకి చాలానే పేర్లు ఉన్నాయి. రన్ మెషిన్ అని, కింగ్ కోహ్లీ అని ఇలా అభిమానులు క్రికెట్ దిగ్గజాలు చాలానే పేర్లు పెట్టారు. నిజానికి కోహ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు అంటే పరుగుల వరద పారాల్సిందే. ఫార్మాట్ ఏదైనా కింగ్ కోహ్లీ ఉంటే ఆ మ్యాచ్ కచ్చితంగా కన్నులపడువగా ఉంటుంది. అతనికి బౌలింగ్ చేయాలి అంటే వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా కాస్త కంగారు పడతారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అయినా ఫీల్డింగ్ అయినా ఎంతో వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు. కానీ, కోహ్లీకి కూడా భయం ఉంది తెలుసా? కోహ్లీ ఒకే విషయానికి మాత్రం తెగ భయపడతాడు. ఇప్పటివరకు ఆ విషయం ఎవరికీ తెలీదు. తాజాగా ఆర్సీబీ పాడ్ కాస్ట్ లో ఆ విషయాన్ని విరాట్ కోహ్లీ రివీల్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ ప్రదర్శన ఎలా ఉన్నా విరాట్ కోహ్లీ మాత్రం టీమ్ బాధ్యతను తన భుజాల మీద వేసుకుని మోస్తున్నాడు. ఎంతో మెచ్యూర్డ్ గా టీమ్ కోసం తన ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఎంత బాగా ఆడినా కోహ్లీపై విమర్శలు చేసే వాళ్లు కూడా ఉన్నారు. కానీ, వాటిని పట్టించుకోకుండా కోహ్లీ తన ఆటతో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. మైదానంలో ఆట అంటే ముందుండే విరాట్ కోహ్లీకి అసలు ఎలాంటి భయాలు ఉండవు అని అంతా అనుకుంటారు. కానీ, విరాట్ కోహ్లీకి కూడా ఒక భయం ఉంది. ఆ ఒక్క విషయంలో మాత్రం విరాట్ చిన్న పిల్లాడిలా వణికిపోతాడంట.

ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ తో పాడ్ కాస్ట్ ని విడుదల చేస్తారని అందరికీ తెలుసు. తాజాగా ఆర్సీబీ పాడ్ కాస్ట్ కి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తనకున్న బిగ్గెస్ట్ ఫియర్ గురించి చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో మాత్రం తాను ఎంతగానో భయపడతాను అన్నాడు. అయితే అది బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో అనుకోకండి. విరాట్ కోహ్లీ భయపడేది ఆటగాళ్లకు కాదు.. విమానాలకు. అవును విరాట్ కోహ్లీకి ఎయిరో ఫోబియా ఉంది. అదే విషయాన్ని కోహ్లీ వెల్లడించాడు. తనకి విమాన ప్రయాణంలో టర్బోలెన్స్ ని చూస్తే చచ్చేంత భయమని చెప్పాడు.

“నాకు టర్బోలెంట్స్ అంటే చచ్చేంత భయం. నేను విమాన ప్రయాణంలో ఎంతో స్టుపిడ్ గా కనిపిస్తాను. టర్బోలెంట్స్ ని చూడగానే నేను వెంటనే నా సీటుని గట్టిగా పట్టుకుంటాను. నేను ఇంక బతకనేమో అనేలా భయమేస్తుంది” అంటూ ఈ ప్రోమోలో కోహ్లీకి ఉన్న బిగ్గెస్ట్ ఫియర్ గురించి రివీల్ చేశారు. దీనిని ఏయిరో ఫోబియా అంటారు. అంటే టర్బోలెంట్స్ వల్ల విమానం కూలిపోతుందేమో? నేను చనిపోతానేమో? అని భయపడటం, యాంగ్జైటీకి గురి కావడాన్ని ఎయిరో ఫోబియా అంటారు. కోహ్లీకి ఈ ఇబ్బంది ఉన్నట్లు తొలిసారి ఈ పాడ్ కాస్ట్ లో రివీల్ చేశాడు. మరి.. విరాట్ కోహ్లీకి ఉన్న బిగ్గెస్ట్ ఫియర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet