Nidhan
గేమ్‌లో రూల్స్ అంటే అందరికీ ఒకేలా వర్తించాలి. ఎవరు దాన్ని అధిగమించినా శిక్ష పడాల్సిందే. కానీ యంగ్ క్రికెటర్స్‌కు ఒకలా.. స్టార్లకు ఒకలా అన్నట్లు నిబంధనల విషయంలో వేర్వేరుగా ప్రవర్తిస్తే విమర్శలు తప్పవు.
గేమ్‌లో రూల్స్ అంటే అందరికీ ఒకేలా వర్తించాలి. ఎవరు దాన్ని అధిగమించినా శిక్ష పడాల్సిందే. కానీ యంగ్ క్రికెటర్స్‌కు ఒకలా.. స్టార్లకు ఒకలా అన్నట్లు నిబంధనల విషయంలో వేర్వేరుగా ప్రవర్తిస్తే విమర్శలు తప్పవు.
Nidhan
ఏ ఆటలోనైనా నిబంధనలు తీసుకొస్తున్నారంటే ఆడియెన్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత బెటర్ చేయడం కోసమేనని చెప్పాలి. ప్లేయర్లు అందరికీ సమన్యాయం జరగడం కోసం అదే విధంగా వాళ్లలో క్రమశిక్షణ తీసుకొచ్చేందుకు, అలాగే గేమ్‌ను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు ఈ రూల్స్ ఉపయోగపడతాయి. రూల్స్ అంటే అందరికీ ఒకేలా వర్తించాలి. ఎవరు దాన్ని అధిగమించినా శిక్ష పడాల్సిందే. కానీ యంగ్ ప్లేయర్లకు ఒకలా.. స్టార్లకు ఒకలా అన్నట్లు నిబంధనల విషయంలో వేర్వేరుగా ప్రవర్తిస్తే విమర్శలు తప్పవు. ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు పరిస్థితి అలాగే ఉంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే బీసీసీఐకి ఎందుకంత భయం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కోహ్లీ అంటే బీసీసీఐకి ఎందుకంత భయం? యంగ్ క్రికెటర్స్‌కు ఓ విధంగా విరాట్‌కు మరో విధంగా రూల్స్ ఉంటాయా? విరాట్‌కు నిబంధనలు వర్తించవా? అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనంతటికీ కారణం కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా ఉదంతమే. ఐపీఎల్-2024 సీజన్ మొదట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేశాడు రాణా. అయితే వికెట్ తీసిన ఆనందంలో బ్యాటర్‌ను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో ఆ మ్యాచ్ తర్వాత అతడికి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అయినా ఆగని హర్షిత్ రీసెంట్గా ఇంకో మ్యాచ్‌లో బ్యాటర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వబోతూ ఆగిపోయాడు. దీంతో అతడి మీద 100 శాతం మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఓ మ్యాచ్‌లో ఆడకుండా బ్యాన్ విధించారు.
హర్షిత్ రాణాలాగే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ప్లయింగ్ కిస్ ఇచ్చాడు. కానీ అతడిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మ్యాచ్ ఫీజులో కోత విధించడం, సస్పెన్షన్ లాంటివి కాదు కదా.. కనీసం అతడికి వార్నింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో హర్షిత్ వంటి యంగ్స్టర్స్కేనా? కోహ్లీకి రూల్స్ వర్తించవా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. బీసీసీఐకి విరాట్ అంటే భయమని.. అందుకే అతడి మీద చర్యలు తీసుకోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం హర్షిత్ రాణా బ్యాటర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని.. కానీ కోహ్లీ ఆడియెన్స్‌కు ఇచ్చాడని.. అది నేరం కిందకు రాదని, అందుకే చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఏదేమైనా ఫ్లయింగ్ కిస్ వివాదం మాత్రం ఐపీఎల్‌ను ఊపేస్తోంది. మరి.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ కాంట్రవర్సీపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
“Kohli k flying kiss me aisa kya hai jo mere wale me nahi hai ?”
– Harshit Rana to Match referee pic.twitter.com/aGVmMpaAF1— N I T I N (@theNitinWalke) May 4, 2024