Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి లెజెండ్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కంటే కోహ్లీనే గ్రేట్ అని అన్నాడు. ఇంకా దాదా ఏమన్నాడంటే..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి లెజెండ్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కంటే కోహ్లీనే గ్రేట్ అని అన్నాడు. ఇంకా దాదా ఏమన్నాడంటే..
Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి, లెజెండ్ సౌరవ్ గంగూలీకి మధ్య సత్సంబంధాలు లేవని అంటుంటారు. భారత జట్టుకు విరాట్ కెప్టెన్‌గా ఉన్న టైమ్‌లో ఇద్దరికీ మధ్య గ్యాప్ వచ్చిందని చెబుతుంటారు. తనను ఓ మాట కూడా చెప్పకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారంటూ అప్పట్లో కోహ్లీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. బీసీసీఐ బాస్‌గా ఉన్న గంగూలీ.. రోహిత్ శర్మకు ఇష్టం లేకపోయినా సారథిగా నియమించాడని, కోహ్లీని తొలగించి అతడికి బాధ్యతలు అప్పజెప్పాడని వార్తలు వచ్చాయి. దీనికి ఊతం ఇస్తూ అప్పటి నుంచి ఐపీఎల్ సమయంలోనూ కోహ్లీ-దాదా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య మళ్లీ కలసిపోయినట్లు కనిపిస్తున్నారు. ఈ వివాదం కారణంగా కింగ్ అభిమానుల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు దాదా. అయితే ఆటపరంగా మాత్రం ఎప్పుడూ విరాట్‌కు సపోర్ట్ ఇస్తూ వస్తున్నాడు.
కెప్టెన్సీ కాంట్రవర్సీ టైమ్‌లో కోహ్లీ-గంగూలీ ఆటతీరు మీద కూడా కంపేరిజన్స్ వచ్చాయి. విరాట్ గ్రేట్ అని కొందరు.. కాదు, కాదు దాదా గొప్ప అంటూ మరికొందరు చర్చకు తెరలేపారు. అయితే ఆ కాంట్రవర్సీపై గంగూలీ క్లారిటీ ఇవ్వడంతో దానికి ఫుల్స్టాప్ పడింది. కానీ ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనే దానిపై తొలిసారి దాదా రియాక్ట్ అయ్యాడు. తన కంటే కోహ్లీనే గొప్ప అన్నాడు. కానీ అగ్రెషన్ పరంగా కాదు.. గేమ్, స్కిల్స్ పరంగా చూసుకుంటే తన కంటే విరాట్ గ్రేట్ అని మెచ్చుకున్నాడు. కింగ్ అద్భుతమైన ఆటగాడని, ఎన్నో రికార్డులను అతడు బ్రేక్ చేశాడని, మరిన్ని బద్దలు కొడతాడని తెలిపాడు. ఇద్దరు ఆటగాళ్లను కంపేర్ చేయడానికి అగ్రెషన్ అనేది ప్రాతిపదిక కాదన్నాడు గంగూలీ.
‘ప్లేయర్లను కంపేర్ చేయడానికి దూకుడు, అగ్రెషన్‌ను ప్రాతిపదికగా తీసుకోకూడదు. స్కిల్స్ పరంగా ఎవరు అత్యుత్తమం అనేది చూడాలి. ఈ విధంగా చూసుకుంటే నా కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ స్కిల్స్ ఉన్న ఆటగాడు. మేం ఇద్దరం రెండు వేర్వేరు జనరేషన్స్‌కు చెందిన వాళ్లం. మా తరంలో నేను ఎన్నో మ్యాచులు ఆడా. ఇప్పుడు కోహ్లీ ఆడుతున్నాడు. మ్యాచుల పరంగా చూసుకుంటే ప్రస్తుతం అతడు నా కంటే వెనుకంజలో ఉండొచ్చు. కానీ కెరీర్ ముగిసేసరికి నా కంటే ఎక్కువ క్రికెట్ ఆడతాడు. అతడు అద్భుతమైన ప్లేయర్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు దాదా. కోహ్లీని మెచ్చుకుంటూ గంగూలీ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కామెంట్‌తో కోహ్లీపై తనకు ఉన్న ప్రేమను చెప్పేశాడని అంటున్నారు. తన కంటే జూనియర్‌ను ఇలా గొప్ప అంటూ మెచ్చుకోవడం మామూలు విషయం కాదని.. గంగూలీ సింప్లిసిటీకి ఇది నిదర్శనం అని ప్రశంసిస్తున్నారు.