Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో కింగ్‌కు కొట్లాడే హక్కు ఉందన్నాడు. గౌతీ ఇంకా ఏమన్నాడంటే..!
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో కింగ్‌కు కొట్లాడే హక్కు ఉందన్నాడు. గౌతీ ఇంకా ఏమన్నాడంటే..!
Nidhan
ఇతర క్రీడల్లోలాగే క్రికెట్లోనూ కొన్ని రైవల్రీస్ ఉన్నాయి. జట్ల మధ్యే కాదు.. కొందరు ఆటగాళ్ల మధ్య కూడా పగలు, ప్రతీకారాలు చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్‌లోనూ ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. క్యాష్ రిచ్ లీగ్‌లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ రైవల్రీ అంటే విరాట్ కోహ్లీ-గౌతం గంభీర్‌దేనని చెప్పాలి. వీళ్లిద్దరూ దేశం తరఫున ఏళ్ల పాటు కలసి ఆడారు. దేశవాళీ క్రికెట్లోనూ ఢిల్లీ తరఫున కలసి బరిలోకి దిగారు. అలాంటిది ఐపీఎల్ వల్ల శత్రువులుగా మారారు. లాస్ట్ సీజన్లో ఆర్సీబీ-లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత వీళ్లు బాహాబాహీకి దిగడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీజన్‌తో తమ మధ్య ఫైట్‌కు ఇద్దరూ ఫుల్స్టాప్ పెట్టారు. ఆర్సీబీ-కోల్‌కతా మ్యాచ్ టైమ్‌లో కలసుకొని హగ్ చేసుకున్నారు గౌతీ-కోహ్లీ. దీంతో ఈ వివాదానికి ఇక్కడితో తెరపడింది.
కోహ్లీతో వివాదం ముగిసిన నేపథ్యంలో తాజాగా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌కు కూడా కొట్లాడే హక్కు ఉందన్నాడు. ఎవరి టీమ్ వాళ్లకు ముఖ్యమని.. జట్టు కోసం నిలబడటం, పోరాడటంలో తప్పు లేదన్నాడు. అతడితో తన రిలేషన్ గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు గౌతీ. ‘జనాలు అనుకునేదానికి నిజానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. విరాట్ కోహ్లీతో నా అనుబంధం గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వేర్వేరు జట్లకు ఆడుతున్నాం. కాబట్టి ఎవరి టీమ్ కోసం వాళ్లు నిలబడే, కొట్లాడే హక్కు వాళ్లకు ఉంటుంది. కోహ్లీకి కూడా నాకు ఉన్నంత హక్కే ఉంది. మా ఇద్దరి రిలేషన్ గురించి మాట్లాడుకునే అవకాశం ఇతరులకు ఇవ్వబోం’ అని గంభీర్ స్పష్టం చేశాడు.
ఇక, గతేడాది వరకు లక్నో సూపర్జియాంట్స్తో జర్నీ చేసిన గంభీర్ ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఆ టీమ్ మెంటార్‌గా వచ్చి సక్సెస్ అయ్యాడు. గతేడాది వరకు మోస్తరుగా పెర్ఫార్మ్ చేస్తూ వచ్చిన కేకేఆర్.. ఈసారి ఏకంగా కప్పు ఎగరేసుకుపోయింది. సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా దింపడం, వెంకటేశ్ అయ్యర్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి రప్పించడం, ఫెయిలైనా మిచెల్ స్టార్క్‌ను టీమ్‌లో కంటిన్యూ చేయడం కలిసొచ్చింది. హర్షిత్ రాణా, అంగ్క్రిష్ రఘువంశీ, రమణ్‌దీప్ సింగ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లను వాడుకున్న తీరు కూడా కేకేఆర్‌కు బిగ్ ప్లస్ అయింది. ఐపీఎల్ మెంటార్‌గా సక్సెస్ అవడంతో భారత జట్టు హెడ్ కోచ్‌గా గంభీర్ రావడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మరి.. కోహ్లీకి కొట్లాడే హక్కు ఉందంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టీ20 WCలో ఓపెనర్‌గా రోహిత్ వద్దు! జైస్వాల్‌కు జోడీగా ఆ క్రికెటరే కరెక్ట్: మాజీ ప్లేయర్
Gautam Gambhir “The perception is far away from reality,My relationship with Virat Kohli is something this country doesn’t need to know.He has as much right as I do to express himself and help our respective team to win.Our relation is not to give masala”pic.twitter.com/V90QCDqfCY
— Sujeet Suman (@sujeetsuman1991) May 29, 2024