Nidhan
పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ రైలీ రూసో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలా ఆడటానికి తానేమైనా విరాట్ కోహ్లీనా అని అన్నాడు.
పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ రైలీ రూసో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలా ఆడటానికి తానేమైనా విరాట్ కోహ్లీనా అని అన్నాడు.
Nidhan
ఐపీఎల్-2024లో ఆడియెన్స్‌ను బాగా నిరాశపర్చిన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఇప్పటిదాకా మెగా లీగ్‌లో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదీ టీమ్. ఈసారైనా రాత మారుతుందేమోనని అనుకుంటే అది సాధ్యం కాలేదు. సీజన్ మధ్యలో కొన్ని విజయాలతో ప్లేఆఫ్స్‌పై ఆశలు రేకెత్తించిన పంజాబ్ ఆ తర్వాత మళ్లీ ట్రాక్ తప్పింది. చాలా మ్యాచుల్లో విజయం అంచుల దాకా వచ్చి కొద్దిలో ఓడిపోయింది. మ్యాచ్‌ను ఫినిష్ చేయడంలో ఉన్న తడబాటే ఆ టీమ్ కొంపముంచింది. బ్యాటర్లు సక్సెస్ అయినప్పుడు బౌలర్లు ఫెయిలవడం, బౌలర్లు రాణించినప్పుడు బ్యాటర్లు చేతులెత్తేయడం కూడా మైనస్‌గా మారింది. అందరూ కలసికట్టుగా ఆడి ఉంటే ఆ టీమ్ కథ వేరేలా ఉండేది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రైలీ రూసో ఫర్వాలేదనిపించాడు.
ఈ సీజన్లో 7 మ్యాచులు ఆడిన రూసో 162 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ బాగుంది. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్న రూసోను కాస్త ముందే టీమ్‌లోకి తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో అతడు టీ20 ఫార్మాట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలా ఆడటానికి తానేమైనా విరాట్ కోహ్లీనని అనుకుంటున్నారా అని అన్నాడు. పొట్టి ఫార్మాట్ మ్యాచుల్లో ప్రతిసారి పరుగులు చేయడం కుదరదని చెప్పాడు. ఎప్పుడో ఒకసారి భారీ స్కోర్లు బాదొచ్చని.. కన్సిస్టెంట్గా రన్స్ చేయడం ఈజీ కాదన్నాడు. టీ20ల్లో ప్రతి రోజూ పరుగులు చేసేందుకు తానేమైనా కోహ్లీనా అని రూసో ప్రశ్నించాడు. విరాట్‌లా నిలకడగా పరుగులు చేయడం ఎవరి వల్ల కాదని ప్రశంసల్లో ముంచెత్తాడు.
టీ20ల్లో బంతి కనిపించిందా బాదుడే అనే మంత్రాన్నే తాను ఫాలో అవుతుంటానని రూసో తెలిపాడు. దీనర్థం అడ్డదిడ్డంగా షాట్లు కొట్టమని కాదని.. బాల్ మెరిట్‌ను బట్టి ఆడాలని సూచించాడు. బాల్ మన ఏరియాలో పడితే బాదాలని, వేరే చోట పడితే కూడా సిక్స్ బాదాలని చూడటం మూర్ఖత్వం అవుతుందన్నాడు. ఐపీఎల్లో రెండు బౌన్సర్ల రూల్ తీసుకురావడం తనకు నచ్చిందన్నాడు. దీని వల్ల బాల్‌కు బ్యాట్‌కు మధ్య మంచి సమతూకం ఏర్పడిందన్నాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఎక్స్ట్రా బ్యాటర్ ఉండటంతో బౌన్సర్లను కూడా బ్యాటర్లు టార్గెట్ చేసి బాదుతున్నారని పేర్కొన్నాడు. ఆ నిబంధనను తీసేస్తే బౌలర్లకు పండగేనని వివరించాడు రూసో. మరి.. తాను కోహ్లీ కాదంటూ రూసో చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Rilee Rossouw said, “you’re expected to score in every match and that’s not going to happen until and unless you are Virat Kohli”. (SportStar). pic.twitter.com/5l0755aqXq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 16, 2024