Virat Kohli: వీడియో: ఇంకా ఆ బాధలో నుంచి బయటకు రాని కోహ్లీ.. గంభీర్​తో షేర్ చేసుకొని..!

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా ఆ బాధలో నుంచి బయటకు రాలేదు. తన పెయిన్​ను పాత స్నేహితుడు, సీనియర్ గౌతం గంభీర్​తో కలసి షేర్ చేసుకున్నాడు కింగ్.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా ఆ బాధలో నుంచి బయటకు రాలేదు. తన పెయిన్​ను పాత స్నేహితుడు, సీనియర్ గౌతం గంభీర్​తో కలసి షేర్ చేసుకున్నాడు కింగ్.

ఐపీఎల్​లో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్​లో విరాట్ కోహ్లీ-గౌతం గంభీర్​ది ఒకటి. వీళ్లిద్దరూ టీమిండియా తరఫున చాలా కాలం కలసి ఆడారు. వీళ్ల డొమెస్టిక్ టీమ్ (ఢిల్లీ) కూడా ఒకటే. వన్డే వరల్డ్ కప్-2011 ఫైనల్​లో భారత జట్టు విజయంలో వీళ్ల పార్ట్​నర్​షిప్ చాలా కీలకపాత్ర పోషించింది. 31 పరుగులకే 2 వికెట్లు పడి కష్టాల్లో పడ్డ టీమ్​ను కోహ్లీ-గంభీర్ ఆదుకున్నారు. ఇద్దరూ కలసి మూడో వికెట్​కు 83 పరుగులు జోడించారు. అయితే ఇంత మంచి బాండింగ్ ఉన్న వీళ్లు ఐపీఎల్ వల్ల శత్రువులుగా మారారు. గతేడాది ఆర్సీబీ-లక్నో మ్యాచ్​ ముగిసిన తర్వాత కోహ్లీ-గౌతీ ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లడం తెలిసిందే. అయితే వీళ్ల గొడవకు ఈ సీజన్​తో ఫుల్​స్టాప్ పడింది. మళ్లీ క్లోజ్ అయిన ఈ లెజెండ్స్ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది.

గంభీర్-కోహ్లీ మళ్లీ కలసిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ నడించింది. ఇందులో పాత గాయాన్ని రేపడం ఆసక్తికరంగా మారింది.  కోల్​కతా నైట్ రైడర్స్​తో మ్యాచ్​కు ఆర్సీబీ రెడీ అయిపోయింది. కోల్​కతా వేదికగా ఇవాళ ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో ఈడెన్ గార్డెన్స్​కు చేరుకున్న డుప్లెసిస్ సేన ప్రాక్టీస్​లో మునిగిపోయింది. ఈ సందర్భంగా కేకేఆర్ మెంటార్​ గంభీర్​ను కలిశాడు కోహ్లీ. అతడితో చాలా సేపు ముచ్చటించాడు. ఇద్దరూ నవ్వుతూ తిరిగి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అయితే ఒకేసారి అక్కడ వాతావరణం వేడెక్కింది. దీనికి కారణం వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​లో భారత్ ఓటమిని కోహ్లీ గుర్తుచేయడమే. ఆ మ్యాచ్​లో తాను ఎలా ఔట్ అయ్యాడో గౌతీకి వివరించాడు కింగ్.

ప్రపంచ కప్ ఓటమి బాధలో నుంచి ఇంకా బయటపడని కోహ్లీ.. ఆ మ్యాచ్​లో ఎలా ఔట్ అయ్యాడో ఇంకోసారి గుర్తుచేసుకున్నాడు. కమిన్స్ బౌలింగ్​లో బాల్​ను డిఫెన్స్ చేయబోయి ఎడ్జ్ అవడంతో క్లీన్ బౌల్డ్ కావడంతో ఆ రోజు కోహ్లీతో పాటు కోట్లాది అభిమానుల హృదయాలు ముక్కలు అయ్యాయి. ఆ డిస్మిసల్ గురించే తాజాగా గంభీర్​తో డిస్కస్ చేశాడు కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని  చూసిన నెటిజన్స్ విరాట్.. ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేయొద్దని, పాత గాయం నుంచి బయటపడి టీ20 వరల్డ్ కప్​ కోసం రెడీ అవ్వమని కామెంట్స్ చేస్తున్నారు. ఆ మ్యాచ్​ను గుర్తుచేసి తమ హార్ట్​ను మళ్లీ బ్రేక్ చేయొద్దని కోరుతున్నారు. మరి.. వరల్డ్ కప్ మిగిల్చిన బాధ నుంచి కోహ్లీ ఇంకా బయటపడకపోవడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments