iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ కొడుకు వచ్చేశాడు.. స్వదేశానికి చేరుకున్న అకాయ్!

  • Published Apr 16, 2024 | 7:41 PM Updated Updated Apr 16, 2024 | 7:41 PM

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులకు ఇటీవల కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. అకాయ్ అని ఆ శిశువుకు నామకరణం చేశారు.

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులకు ఇటీవల కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. అకాయ్ అని ఆ శిశువుకు నామకరణం చేశారు.

  • Published Apr 16, 2024 | 7:41 PMUpdated Apr 16, 2024 | 7:41 PM
Virat Kohli: కోహ్లీ కొడుకు వచ్చేశాడు.. స్వదేశానికి చేరుకున్న అకాయ్!

విరాట్ కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్​లో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటములతో నిరాశపరుస్తున్నా కింగ్ మాత్రం అదిరిపోయే బ్యాటింగ్​తో అందరి మనసులు దోచుకుంటున్నాడు. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన 7 మ్యాచుల్లో కలిపి 361 పరుగులు చేశాడతను. ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో ఫస్ట్ ప్లేస్​లో ఉన్న విరాట్.. టోర్నమెంట్ ముగిసేసరికి ఇంకెన్ని పరుగులు చేస్తాడో చూడాలి. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో సోమవారం జరిగిన మ్యాచ్​లోనూ కోహ్లీ తన బ్యాట్ పవర్ చూపించాడు. 20 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే అతడు రాంగ్ టైమ్​లో ఔట్ అవడం ఆర్సీబీని దెబ్బతీసింది. కనీసం తర్వాతి మ్యాచుల్లోనైనా తన టీమ్​ను గెలిపించాలని కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు. ఈ తరుణంలో కింగ్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.

కోహ్లీ కుమారుడు అకాయ్ భారత్​కు వచ్చేశాడు. విరాట్ సతీమణి అనుష్క శర్మ కొడుకుతో సహా మంగళవారం స్వదేశానికి విచ్చేశారు. ఎయిర్​పోర్ట్​లో ఆమె సందడి చేశారు. కూతురు వమికాతో పాటు చేతిలో అకాయ్​ను ఎత్తుకొని అనుష్క కనిపించారు. ఆమె ముఖానికి మాస్క్ వేసుకున్నారు. అకాయ్ ఫేస్ రివీల్ కాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నారి తలకు క్యాప్ వేశారు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో కోహ్లీ అభిమానులు ఖుష్ అవుతున్నారు. విరాట్ వారసుడు వచ్చేశాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అనుష్క ప్రెగ్నెన్సీ కారణంగా కోహ్లీ కొన్నాళ్లు టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఇదే రీజన్ వల్ల ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్​లో అతడు పాల్గొనలేదు. కొడుకు పుట్టాక కూడా వెంటనే అతడు భారత్​కు రాలేదు. కొన్నాళ్లు లండన్​లోనే ఉంటూ అనుష్కను, అకాయ్​ను జాగ్రత్తగా చూసుకున్నాడు.

సరిగ్గా ఐపీఎల్-2024 స్టార్ట్ అవడానికి ముందు స్వదేశానికి వచ్చాడు కోహ్లీ. వచ్చీరాగానే ప్రాక్టీస్​లో మునిగిపోయాడు. తీవ్రంగా సాధన చేస్తూ టచ్​లోకి వచ్చాడు. దాన్నే మ్యాచుల్లో కంటిన్యూ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే కోహ్లీ ఎంత బాగా ఆడినా ఇతర బ్యాటర్ల నుంచి ముఖ్యంగా ఫారెన్ ప్లేయర్స్​ నుంచి ఆశించినంత మద్దతు లభించడం లేదు. మాక్స్​వెల్, గ్రీన్​తో పాటు బౌలింగ్ యూనిట్ దారుణంగా విఫలమవుతుండటంతో బెంగళూరుకు వరుస ఓటములు తప్పడం లేదు. ఆడిన 7 మ్యాచుల్లో ఆరింట ఓడిన డుప్లెసిస్ సేన పాయింట్స్ టేబుల్​లో ఆఖరి స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇలాగే ఆడితే ప్లేఆఫ్స్ క్వాలిఫై అవడం కాదు కదా.. పాయింట్స్ టేబుల్​లో లాస్ట్​ ప్లేస్​ నుంచి ఒక్క స్థానం పైకి ఎగబాకడం కూడా కష్టమే.