iDreamPost
android-app
ios-app

SRH నుంచి DCని కాపాడిన అంపైర్.. ఆ బాల్ వైడ్ ఇవ్వడంతో..

Travis Head- IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ విధ్వంసం కొనసాగుతోంది. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన ట్రావిస్ హెడ్ శతకంతో చెలరేగాడు. చెప్పి మరీ కొడుతూ ఉండటం ఇక్క మరో ప్రత్యేకత.

Travis Head- IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ విధ్వంసం కొనసాగుతోంది. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన ట్రావిస్ హెడ్ శతకంతో చెలరేగాడు. చెప్పి మరీ కొడుతూ ఉండటం ఇక్క మరో ప్రత్యేకత.

SRH నుంచి DCని కాపాడిన అంపైర్.. ఆ బాల్ వైడ్ ఇవ్వడంతో..

ట్రావిస్ హెడ్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారు మోగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రావిస్ హెడ్ పెను సంచనలంగా మారిపోయాడు. ప్రతి మ్యాచ్ లో తన బ్యాటుతో విజృంభిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే.. హెడ్ లక్ష్యం మాత్రం బౌండరీ కొట్టడమే. ఢిల్లీ హోం గ్రౌండ్ లో వాళ్ల ఫ్యాన్స్ ముందు బౌలర్ల నుంచి ఎలాంటి సమాధానం లేకుండా చేశాడు. ట్రావిస్ హెడ్ దెబ్బకు ఢిల్లీ ఫ్యాన్స్ ముఖాలు కూడా వాడిపోయాయి. ట్రావిస్ హెడ్ ప్రతి మ్యాచ్ లో చెలరేగుతూనే ఉన్నాడు. అయితే మామూలుగా కొట్టడం వేరు.. కానీ, ట్రావిస్ హెడ్ చెప్పి మరీ కొడుతున్నాడు. ఈ మ్యాచ్ లో 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ట్రావిస్ హెడ్ ఊచకోత నుంచి ఢిల్లీని అంపైర్ కాపాడాడు అని మీకు తెలుసా?

ఢిల్లీ వేదికగా జరుగుతున్న హైదరాబాద్- ఢిల్లీ మ్యాచ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. పది ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక టీమ్ టోటల్ కావడం విశేషం. 20 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన తొలి రెండు రికార్డులు కూడా హైదరాబాద్ పేరిటే ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్(89), అభిషేక్ శర్మ(46) చెలరేగడంతో హైదరాబాద్ కు సూపర్ స్టార్ట్ దక్కింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బౌలర్ల నుంచి సమాధానం లేదు. అలా చూస్తుండిపోయారు. అయితే ఇంత ఫామ్ లో ఉన్న హైదరాబాద్ జట్టుకు బౌలర్లు కాకుండా అంపైర్ బ్రేక్ వేశాడు. అంపైర్ తీసుకున్న నిర్ణయమే ఢిల్లీని కాపాడింది.

DC

ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ట్రావిస్ హెడ్ కు అంపైర్ నిర్ణయం బ్రేకులు వేసింది. అప్పటికే అభిషేక్ శర్మ అవుటై ఉన్నాడు. ట్రావిస్ హెడ్ శతకం కొట్టే ఉత్సాహంలో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ కాస్త కంట్రోల్ చేస్తున్నా కూడా హెడ్ మాత్రం విజృంభిస్తున్నాడు. అయితే కుల్దీప్ యాదవ్ వేసిన 8.6వ బాల్ ని అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. నిజానికి అది ఫెయిర్ డెలివరీ. అప్పటికే ఒక రివ్యూ కోల్పోయి ఉన్న ఢిల్లీ మరోసారి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే ఫెయిర్ డెలివరీ అని తెలిసినా నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయలేదు. ఆ తర్వాత బంతికే ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేరాడు.

నిజానికి దానిని వైడ్ ఇవ్వకపోతే డాట్ బాల్ గా ఉండేది. కుల్దీప్ ఓవర్ అయిపోయేది. కానీ, అంపైర్ తీసుకున్న నిర్ణయం ఢిల్లీ జట్టు నెత్తిన పాలు పోసినట్లు అయ్యింది. ఆ తర్వాత క్లాసెన్ కూడా త్వరగానే అవుట్ అవ్వడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విధ్వంసానికి కాస్త బ్రేకులు పడ్డట్లు అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అతను వైడ్ ఇవ్వకపోతే ఈ మ్యాచ్ మరోలా ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ అర్ధ శతకం మిస్ కావడం, ట్రావిస్ హెడ్ శతకం కూడా మిస్ కావడంతో కాస్త ఎమోషనల్ అవుతున్నారు.