వరల్డ్ కప్ కి ముందు.. ఫామ్ లోకి టీమ్ ఇండియా రాక్షసుడు.. ప్రత్యర్థులకు చుక్కలే..

Team India Fans Happy Over That Player Form: టీమ్ ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హైలో ఉన్నారు. ఎందుకంటే ఆ రాక్షసుడు ఫామ్ లోకి వచ్చేశాడు . బౌలింగ్, బాటింగ్ తో ఇరగదీస్తున్నాడు. మరి ఆ ఆటగాడు ఎవరో గుర్తు పట్టారా?

Team India Fans Happy Over That Player Form: టీమ్ ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హైలో ఉన్నారు. ఎందుకంటే ఆ రాక్షసుడు ఫామ్ లోకి వచ్చేశాడు . బౌలింగ్, బాటింగ్ తో ఇరగదీస్తున్నాడు. మరి ఆ ఆటగాడు ఎవరో గుర్తు పట్టారా?

క్రికెట్ ప్రపంచం మొత్తం ఐపీల్ 2024 సీజన్ గురించా మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఆ తర్వాత వస్తోంది.. పొట్టి క్రికెట్ సమరం కాబట్టి. ఇప్పటి ప్రదర్శన అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. దానికి తగినట్లు గానే అన్ని జట్ల ఆటగాళ్లు ఐపీఎల్లో విజృంభిస్తున్నారు. కానీ, టీమ్ ఇండియా అభిమానుల్లో మాత్రం కొంచం భయం, బెరుకు ఉన్నాయి. ఎందుకంటే టీం ప్రకటించిన తర్వాత నుంచి చాల మంది ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయడం లేదు. ఇలా ఐతే ఎలా అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఐతే ఒకడు మాత్రం ఇన్నాళ్లు లేనిది భయంకరమైన ఫామ్లోకి వచ్చేశాడు . అతని పెరఫార్మెన్స్ చూసి టీం ఇండియా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆటను ఎవరో గుర్తుపట్టారా?

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ రాక్షసుడు మరెవరో కాదు.. టీం ఇండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ జట్టు సారథి హార్దిక్ పాండ్య గురించి. ముంబయి జట్టుకు కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య ప్రదర్శన అస్సలు బాలేదు. ముంబయి ఇండియన్స్ జట్టు కూడా టేబుల్ లాస్ట్ లోకి వెళ్లిపోయింది. అందరు హార్దిక్ పాండ్య మీద ట్రోలింగ్ కూడా చేశారు. రోహిత్ ప్లేస్ లో హార్దిక్ వచ్చాడు అని గోల గోల చేశారు. దానికి తగినట్లు గానే అతని ప్రదర్శన కూడా బాలేదు.

ఎప్పుడైతే టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టుని ప్రకటించిందో.. అప్పటి నుంచి హార్దిక పాండ్య ఆట మొత్తం మారిపోయింది. ఇండియన్ జెర్సీలో ప్రత్యర్థులకు ఎలాగైతే చుక్కలు చూపించే వాడో.. ఇప్పుడు కూడా అదే ఆట తీరుతో చెలరేగిపోతున్నాడు. ఎక్కడ కూడా ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వడం లేదు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా బాల్ తో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో అనే కాదు. గత మూడు మ్యాచుల్లో కూడా హార్దిక్ అద్భుతంగా రాణించాడు. హైదరాబాద్ పై 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 31 పరుగులు ఇచ్చి.. 3 వికెట్స్ దక్కించుకున్నాడు.

హార్దిక్ బాగా బౌలింగ్ వేయడం చూసి ముంబయి ఫ్యాన్స్ కూడా ఫిదా ఐపోతున్నారు. తిట్టిన వాళ్లంతా ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు. హార్దిక్ అటు బ్యాటుతో కూడా బాగానే ప్రదర్శన చేస్తున్నాడు. వరల్డ్ కప్ కి ముందు హార్దిక్ ఇలాటిని ఫామ్ లోకి రావడంపై టీం ఇండియన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హార్దిక్ కేవలం బ్యాటింగ్ చేసిన.. కేవలం బౌలింగ్ చేసిన సరిపోదు.. మంచి అల్రౌండ్ ప్రదర్శన చేస్తేనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అందుకే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా లక్నో జట్టుపై 2 వికెట్స్, కేకేఆర్ పై 2 వికెట్లు, తాజాగా హైదరాబాద్ టీంపై 3 వికెట్లు తీసుకున్నాడు. మరి.. హార్దిక్ పాండ్య ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments