Nidhan
టీమిండియాతో మ్యాచ్ అంటే అందరూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించే మాట్లాడతారు. వీళ్లను ఎలా ఆపడం అని ప్రత్యర్థి జట్లు కూడా తలలు పట్టుకుంటాయి. అయితే వీళ్లిద్దరి కంటే కూడా ఆ భారత ఆటగాడ్ని చూస్తే వణుకు పడుతోందని అంటున్నాడు డేవిడ్ మిల్లర్.
టీమిండియాతో మ్యాచ్ అంటే అందరూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించే మాట్లాడతారు. వీళ్లను ఎలా ఆపడం అని ప్రత్యర్థి జట్లు కూడా తలలు పట్టుకుంటాయి. అయితే వీళ్లిద్దరి కంటే కూడా ఆ భారత ఆటగాడ్ని చూస్తే వణుకు పడుతోందని అంటున్నాడు డేవిడ్ మిల్లర్.
Nidhan
ఇంకో రెండు వారాల్లో టీ20 ప్రపంచ కప్-2024కు తెరలేవనుంది. పొట్టి కప్పును కొట్టేందుకు అన్ని జట్లు తమ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. మెగా టోర్నీ కంటే ముందు పలు టీ20 మ్యాచ్‌లు ఆడి రెడీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్‌తో బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ భారత ఆటగాడ్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతోందని అన్నాడు. సాధారణంగా టీమిండియాతో మ్యాచ్ అంటే అందరూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించే మాట్లాడతారు. వీళ్లను ఎలా ఆపాల్నా అని ప్రత్యర్థి జట్లు కూడా తలలు పట్టుకుంటాయి. అయితే వీళ్లిద్దరి కంటే కూడా ఆ భారత ఆటగాడ్ని చూస్తే భయమేస్తోందని అంటున్నాడు మిల్లర్.
మిల్లర్‌ను అంతగా భయపెడుతున్న ఆ టీమిండియా క్రికెటర్ మరెవరో కాదు.. జస్ప్రీత్ బుమ్రా. టీ20 వరల్డ్ కప్‌లో అన్ని జట్ల బ్యాటర్లకు బుమ్రాతోనే ప్రమాదం పొంచి ఉందన్నాడు మిల్లర్. అతడి బౌలింగ్‌లో ఆడటం అంత ఈజీ కాదన్నాడు. అతడి పేస్, స్వింగ్, యార్కర్లను తట్టుకొని పరుగులు చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ‘భారత జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ వాళ్లందరిలోనూ బుమ్రా చాలా డేంజర్. అతడు ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా వరల్డ్ క్లాస్ బౌలర్‌గా ఉంటూ తన సత్తా చూపిస్తున్నాడు. అతడితో నాకు ప్రమాదమే. నాకే కాదు రాబోయే ప్రపంచ కప్‌లో మిగతా జట్ల బ్యాటర్లకు కూడా ప్రధాన ముప్పు బుమ్రా నుంచే పొంచి ఉంది’ అని మిల్లర్ స్పష్టం చేశాడు.
పొట్టి కప్పులో బుమ్రాను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. కానీ అతడి బౌలింగ్‌ను ఫేస్ చేయడం కష్టమని మిల్లర్ చెప్పాడు. కాగా, ఐపీఎల్-2024లో బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఆడిన 13 మ్యాచుల్లో కలిపి 20 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ 6గా ఉంది. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు పరుగులు కట్టడి చేస్తూనే, మరోవైపు వికెట్లు కూడా తీస్తూ ప్రత్యర్థి జట్ల బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఈ సీజన్లో ముంబైపై భారీ స్కోర్లు బాదిన బ్యాటర్లు కూడా బుమ్రా బౌలింగ్‌లో మాత్రం సింగిల్స్, డబుల్స్ తీసేందుకు ఇబ్బంది పడ్డారు. మరి.. బుమ్రాను చూస్తుంటే వణుకు పుడుతోందంటూ మిల్లర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.