Nidhan
భారత జట్టు నయా హెడ్ కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్ ఫైనలైజ్ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే బాకీ ఉందని, మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఒక్క కామెంట్‌తో ఈ పోస్ట్ గురించి తేల్చేశాడు గౌతీ.
భారత జట్టు నయా హెడ్ కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్ ఫైనలైజ్ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే బాకీ ఉందని, మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఒక్క కామెంట్‌తో ఈ పోస్ట్ గురించి తేల్చేశాడు గౌతీ.
Nidhan
టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా ఎవరొస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాహుల్ ద్రవిడ్ వారసుడుగా అతడు వస్తే బెటర్.. కాదు ఇతడే కరెక్ట్ కంటూ ఫ్యాన్స్ కూడా పలువురి పేర్లు చెబుతూ డిస్కషన్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌తో పాటు కివీస్ లెజెండ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు కోచ్ రేసులో బాగా వినిపించాయి. అయితే వీళ్లు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదని అంటున్నారు. కోచ్ రేసులో అందరికంటే ఎక్కువగా ప్రచారం అవుతున్న పేరు గౌతం గంభీర్. కొత్త కోచ్‌ను నియమించనున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచి గౌతీ పేరు వైరల్ అవుతోంది. దీనికి కారణం అతడి సక్సెస్ అనే చెప్పాలి. ప్లేయర్‌గా టీమిండియాకు అపూర్వ సేవలు అందించిన అతడు.. కెప్టెన్‌గా ఐపీఎల్లో విజయవంతం అయ్యాడు.
అప్పట్లో కెప్టెన్‌గా కేకేఆర్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించిన గంభీర్.. ఇప్పుడు మెంటార్‌గా ఆ జట్టును ఛాంపియన్‌ను చేశాడు. దీంతో భారత జట్టుకు కోచ్‌గా అతడే కరెక్ట్ అనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అతడితో భారత క్రికెట్ బోర్డు చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వీటికి మరింత ఊతం ఇస్తూ ఐపీఎల్-2024 ఫైనల్ ముగిసిన తర్వాత గౌతీతో సుదీర్ఘంగా డిస్కస్ చేస్తూ కనిపించాడు బోర్డు సెక్రెటరీ జైషా. దీంతో హెడ్ కోచ్‌గా గంభీర్ ఫైనలైజ్ అయ్యాడని అంతా ఫిక్స్ అయ్యారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే బాకీ ఉందని.. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో ఒక్క కామెంట్‌తో హెడ్ కోచ్‌పై తేల్చేశాడు గంభీర్. ఇక మీదట కూడా తాను ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కానున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవడంపై గంభీర్ రియాక్ట్ అయ్యాడు.
కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచినందుకు హర్షం వ్యక్తం చేశాడు గౌతీ. అయితే ఇక్కడితే ఏదీ అయిపోలేదని.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అన్నాడు. ‘ఇది జస్ట్ బిగినింగ్. ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్‌గా నిలవాలంటే కేకేఆర్ ఇంకా 3 ట్రోఫీలు నెగ్గాలి. ఆ దిశగా మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ చెరో 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన నేపథ్యంలో వాళ్లను దాటుతామంటూ అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవిపై నేరుగా అతడు స్పందించలేదు. కానీ కేకేఆర్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందని.. ఇంకా మూడు ట్రోఫీలు గెలవాలన్నాడు. దీంతో ఆ ఫ్రాంచైజీతో ఉండేందుకే గంభీర్ మొగ్గుచూపుతున్నాడని.. భారత జట్టు కోచింగ్ బాధ్యతలు తీసుకునే ఇంట్రెస్ట్ అతడికి లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్‌కతా ఆరు కప్పులు నెగ్గాకే.. అతడు ఇంటర్నేషనల్ కోచింగ్ సైడ్ వస్తాడని మరికొందరు అంటున్నారు. మరి.. గంభీర్ మాటల్లో మతలబు ఏంటో కామెంట్ చేయండి.
Gautam Gambhir said “We still need to win 3 more trophies to become the most successful IPL team & the journey for that has just begun”. [Sportskeeda] pic.twitter.com/PKcQJBiFHo
— Johns. (@CricCrazyJohns) May 29, 2024