టీమిండియాకు కోచింగ్ ఇచ్చేందుకు రెడీ.. సౌతాఫ్రికా లెజెండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియాకు కోచింగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని అంటున్నాడో సౌతాఫ్రికా లెజెండ్. కోచ్​గా వస్తాను అంటూనే ఒక మెలిక కూడా పెట్టాడీ మాజీ క్రికెటర్.

టీమిండియాకు కోచింగ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని అంటున్నాడో సౌతాఫ్రికా లెజెండ్. కోచ్​గా వస్తాను అంటూనే ఒక మెలిక కూడా పెట్టాడీ మాజీ క్రికెటర్.

ఒకవైపు ఐపీఎల్-2024 హడావుడి నడుస్తుండగానే మరోవైపు భారత క్రికెట్​కు సంబంధించిన ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. అదే కొత్త హెడ్​ కోచ్. టీమిండియాకు హెడ్ కోచ్​గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఎప్పుడో ముగిసింది. వన్డే వరల్డ్ కప్-2023 పూర్తయ్యాక ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకోవాలి. కానీ టీ20 ప్రపంచ కప్​-2024కు అట్టే సమయం లేకపోవడంతో అప్పటివరకు కోచ్​గా ఉండమని బీసీసీఐ కోరింది. దీంతో కంటిన్యూ అవుతూ వచ్చాడు ద్రవిడ్. ఇక మీదట కొనసాగనని ఆయన కరాఖండీగా చెప్పడం, పొట్టి కప్పుకు టైమ్ దగ్గర పడటంతో కొత్త కోచ్​ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దరఖాస్తులను ఆహ్వానించింది బోర్డు. అలాగే కొందరు లెజెండ్స్​తో సంప్రదింపులు కూడా జరుపుతోంది.

భారత జట్టుకు కొత్త కోచ్​గా ఎవరు వస్తారనే డిస్కషన్స్ ఊపందుకుంటున్నాయి. గౌతం గంభీర్, రికీ పాంటింగ్, మహేళ జయవర్దనే, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి పలువురు లెజెండ్స్​తో బోర్డు టచ్​లో ఉందని, వీరిలో ఒకరు ఆ పోస్ట్​లో రావడం గ్యారెంటీ అని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ తరుణంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాకు కోచ్​గా రావాలని ఉందన్నాడు. కోచింగ్ అంటే తనకు ఇంట్రెస్ట్ ఉందన్నాడు. లైఫ్​లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేమన్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం తనకు ఇష్టమన్నాడు ఏబీడీ. ఒకవైపు కోచ్​గా వస్తానని అంటూనే.. ఇప్పుడే దీని గురించి ఏదీ చెప్పలేనంటూ మెలిక పెట్టాడు.

‘ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. కోచింగ్​ విషయం మీద నేను అంతగా ఆలోచించలేదు. దీని మీద నాకు అంత అవగాహన లేదు. కోచింగ్​ను కూడా నేను ఎంజాయ్ చేయగలనని భావిస్తున్నా. అయితే ఈ రోల్​ విషయంలో నేను ఆస్వాదించలేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటివి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఏదైనా సాధ్యమే. ఒకవేళ నేను నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటే ఏదైనా జరగొచ్చు’ అని డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఏబీడీ కామెంట్స్ చూసిన నెటిజన్స్.. కోచ్​గా రావడం అతడికి ఇష్టమేనని అంటున్నారు. అయితే అందుకు కాస్త టైమ్ కావాలని, కోచ్​గా ఏం కావాలో అవన్నీ నేర్చుకున్నాకే రేసులోకి దిగాలని డివిలియర్స్​ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ టీమిండియాకు అతడు కోచ్​గా వస్తే అందరిలోనూ ఫియర్​లెస్ అప్రోచ్​ తీసుకొస్తాడని అభిప్రాయపడుతున్నారు. మరి.. ఏబీడీ కోచ్​గా వస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments