iDreamPost
android-app
ios-app

టీమిండియాకు కోచ్​గా రావాలని ఉంది! మనసులో మాట చెప్పిన ఆస్ట్రేలియా లెజెండ్!

  • Published May 14, 2024 | 3:44 PMUpdated May 14, 2024 | 3:56 PM

భారత జట్టుకు హెడ్ కోచ్​గా పని చేయాలని ఉందని ఓ ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు. కోచ్​గా వస్తా అంటూనే ఒక మెలిక కూడా పెట్టాడు.

భారత జట్టుకు హెడ్ కోచ్​గా పని చేయాలని ఉందని ఓ ఆస్ట్రేలియా లెజెండ్ అన్నాడు. కోచ్​గా వస్తా అంటూనే ఒక మెలిక కూడా పెట్టాడు.

  • Published May 14, 2024 | 3:44 PMUpdated May 14, 2024 | 3:56 PM
టీమిండియాకు కోచ్​గా రావాలని ఉంది! మనసులో మాట చెప్పిన ఆస్ట్రేలియా లెజెండ్!

టీమిండియాకు కొత్త కోచ్ రానున్నాడనే విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంకొన్నాళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతాడు. అమెరికా-వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్-2024తో ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. నవంబర్ 2021లో భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ దిగ్గజం.. వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ ముగిసే వరకు కోచ్​గా ఉన్నాడు. పదవీకాలం పూర్తవడంతో తాను తప్పుకుంటానని భారత క్రికెట్ బోర్డుకు చెప్పాడు. కానీ టీ20 ప్రపంచ కప్​కు ఎక్కువ టైమ్ లేకపోవడంతో అప్పటిదాకా కోచ్​గా ఉండమని కోరడంతో కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఆ గడువు కూడా ముగియడంతో ద్రవిడ్ ప్లేస్​లో కొత్త కోచ్ రావడం ఖాయంగా మారింది.

కొత్త కోచ్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బీసీసీఐ. జీతం, అర్హతలు తదితర వివరాలతో ప్రకటన కూడా విడుదల చేసింది. భారత నయా కోచ్ రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, గౌతం గంభీర్​తో పాటు ఇంకా పలువురు ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లెజెండ్, లక్నో సూపర్ జియాంట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాకు కోచ్​గా రావాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. భారత జట్టుకు కోచ్​గా పని చేయడం అంటే మామూలు విషయం కాదని.. అది ఓ అద్భుతమైన రోల్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇండియాలో టాలెంటెడ్ క్రికెటర్లకు లెక్క లేదని.. ప్రతిభావంతులను పట్టుకొని సానబెడితే అద్భుతాలు చేస్తారన్నాడు.

‘భారత జట్టుకు కోచ్​గా పని చేయడం అనేది ఎక్స్​ట్రార్డినరీ రోల్. ఈ దేశంలో ప్రతిభావంతులైన ప్లేయర్లకు కొదువ లేదు. కానీ టీమిండియాకు కోచ్​గా రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ దిశగా నేను అంతగా ఆలోచించలేదు. ఒక ఇంటర్నేషనల్ కోచ్​గా ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు. అంతర్జాతీయ జట్టును కోచ్​గా వెనుక ఉండి నడిపించడం అంత ఈజీ కాదు. వాళ్ల మీద ఎంతో ప్రెజర్ ఉంటుంది’ అని లాంగర్ చెప్పుకొచ్చాడు. ఒకవైపు భారత జట్టుకు కోచ్​గా ఉండాలని ఉందంటూనే, మరోవైపు ఆ దిశగా తాను ఆలోచించలేదంటూ మెలిక పెట్టాడు లాంగర్. అతడి మాటల్ని బట్టి టీమిండియాకు కోచ్​గా వర్క్ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఒత్తిడి గురించి ఆలోచించి వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. భారత జట్టుకు కోచ్​గా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి