రోహిత్ శర్మ ప్లాన్-B.. వరల్డ్ కప్ జట్టులోకి నటరాజన్! అంతా స్కెచ్ ప్రకారమే!

ఐపీఎల్​లో అదరగొడుతున్న సన్​రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్​కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే ప్రపంచ కప్ జట్టులోకి నట్టూ ఎంట్రీ గ్యారెంటీగా కనిపిస్తోంది. అందుకోసం రోహిత్ శర్మ ప్లాన్ బీ రెడీ చేస్తున్నాడు.

ఐపీఎల్​లో అదరగొడుతున్న సన్​రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్​కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే ప్రపంచ కప్ జట్టులోకి నట్టూ ఎంట్రీ గ్యారెంటీగా కనిపిస్తోంది. అందుకోసం రోహిత్ శర్మ ప్లాన్ బీ రెడీ చేస్తున్నాడు.

భారత క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్​-2024లో ఆడే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా స్క్వాడ్​ను రీసెంట్​గా అనౌన్స్ చేసింది బీసీసీఐ. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్యాటింగ్, బౌలింగ్​ యూనిట్లు పటిష్టంగా ఉండేలా టీమ్​ను రూపొందించారు సెలెక్టర్లు. ఈ జట్టుకు పేస్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అయితే జట్టు ఎంపికలో కొన్ని విషయాలపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీమ్ పేస్ విభాగాన్ని ఇంకా బలోపేతం చేస్తే బాగుండేదనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. జస్​ప్రీత్ బుమ్రాకు తోడుగా ఐపీఎల్-2024లో అదరగొడుగుతున్న సన్​రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్​ను తీసుకుంటే జట్టు సూపర్​ స్ట్రాంగ్​గా మారేదనే కామెంట్స్ వస్తున్నాయి.

నటరాజన్​కు టీమ్​లో చోటు దక్కకపోవడం సరికాదంటూ కొందరు సీనియర్ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. ఈ ఐపీఎల్​ సీజన్​లో ఆడిన 10 మ్యాచుల్లో 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ లిస్ట్​లో టాప్​లో ఉన్న నటరాజన్​ను టీమ్​లోకి తీసుకోకుండా సెలెక్టర్లు తప్పు చేశారంటూ సీరియస్ అవుతున్నారు. నట్టూ పక్కా టీ20 స్పెషలిస్ట్ అని.. డెత్ ఓవర్స్​లో అతడిలా యార్కర్లు, స్లో డెలివరీస్ వేయడం బుమ్రాకు తప్ప ఎవరికీ సాధ్యం కాదని చెబుతున్నారు. అయితే నటరాజన్​కు వరల్డ్ కప్ స్క్వాడ్​లో ప్లేస్ దక్కలేదని బాధపడుతున్న వాళ్లందరికీ గుడ్ న్యూస్. అతడ్ని టీమ్​లోకి తీసుకోవడం ఫిక్స్ అని తెలుస్తోంది. ఎస్​ఆర్​హెచ్ పేసర్ కోసం రోహిత్ శర్మ ప్లాన్-బీ వేశాడని క్రికెట్ వర్గాల సమాచారం.

బీసీసీఐ అనౌన్స్ చేసిన వరల్డ్ కప్ స్క్వాడ్​లో మెయిన్ టీమ్​లో పేసర్లుగా బుమ్రాతో పాటు అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఇందులో బుమ్రా ఇప్పుడు ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. సిరాజ్​ ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్నా ఇంటర్నేషనల్ క్రికెట్​లో అతడికి చాలా అనుభవం ఉంది. ఒక్క మ్యాచ్​తో అతడు తిరిగి లయను అందుకోగలడు. ఇంక టీమ్​లో చోటు దక్కించుకున్న లెఫ్టార్మ్ పేసర్ అర్ష్​దీప్ వికెట్లు తీస్తున్నా అతడి ఎకానమీ 10గా ఉంది. ఐపీఎల్​లో బిగ్ టీమ్స్ మీద అతడు ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు.

అర్ష్​దీప్​ను అబ్జర్వేషన్​లో పెట్టాలని రోహిత్ డిసైడ్ అయ్యాడట. వరల్డ్ కప్ టీమ్​లో మే 25వ తేదీ వరకు మార్పుచేర్పులు చేసుకోవచ్చు. దీంతో ఆ డెడ్​లైన్ లోపు అర్ష్​దీప్ మెరుగవ్వకపోతే అతడి ప్లేస్​లో నటరాజన్​ను తీసుకోవాలని రోహిత్​తో పాటు టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తోందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. పర్ఫెక్ట్ స్కెచ్ ప్రకారం టీమిండియాలోకి నట్టూ ఎంట్రీకి రూట్ క్లియర్ అవుతోందని.. అర్ష్​దీప్ ఫెయిలైతే ఇక ఎస్​ఆర్​హెచ్​ పేసర్​ను టీమ్​లోకి తీసుకోకుండా ఎవరూ ఆపలేరని క్రికెట్ వర్గాల సమాచారం. మరి.. భారత ప్రపంచ కప్ జట్టులోకి నట్టూ రావాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

Show comments