Tirupathi Rao
Australia Squad For T20 World Cup 2024: ఆస్ట్రేలియా జట్టు రాబోయే టీ20 వరల్డ్ కప్ విషయంలో భారీ తప్పిదమే చేసేలా ఉంది. ఐపీఎల్ లో ఇరగదీస్తున్న ఆ ప్లేయర్ కు తుది జట్టులో అవకాశం ఇవ్వడం లేదు అంటున్నారు.
Australia Squad For T20 World Cup 2024: ఆస్ట్రేలియా జట్టు రాబోయే టీ20 వరల్డ్ కప్ విషయంలో భారీ తప్పిదమే చేసేలా ఉంది. ఐపీఎల్ లో ఇరగదీస్తున్న ఆ ప్లేయర్ కు తుది జట్టులో అవకాశం ఇవ్వడం లేదు అంటున్నారు.
Tirupathi Rao
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఎంతో మంది యువ క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది. ఎంతోమంది యువ క్రికెటర్లు టీమిండియాలోకి రావడానికి.. వారి కెరీర్లను అద్భుతంగా మలుచుకునేందుకు ఒక మంచి ప్లాట్ ఫామ్ అయ్యింది. ఈ సీజన్లో కూడా ఎంతో మంది అద్భుతంగా రాణిస్తున్నారు,రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఈసారి కూడా చాలామందికి టీమిండియాలో చోటు దక్కే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఐపీఎల్ లో ఇండియన్ కుర్రాళ్లే కాకుండా.. విదేశీ కుర్రాళ్లు కూడా ఎంతో మంది మెప్పిస్తున్నారు. వారిలో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్. ఈ ప్రదర్శనతో వచ్చే టీ20 వరల్డ్ కప్ లో పక్కా చోటు అనుకున్నారు. కానీ, ఆ ఛాన్స్ అయితే కనిపించడం లేదు.
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకటే పేరు రీసౌండింగ్ వస్తోంది. అదే జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్. ఇప్పుడు ఐపీఎల్ 2024లో ఇతనొక సంచలనం. ప్రతి ఒక్క బౌలర్ ని ఉతికి ఆరేశాడు. ఏ వరల్డ్ క్లాస్ బౌలర్ ని కూడా వదల్లేదు. ప్రతి మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా విజృంభించాడు. భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న సీనియర్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఫ్రేజర్ స్పీడును అందుకోవడానికి ఐపీఎల్ లో చాలామంది బ్యాటర్లు తంటాలు పడుతున్నారు. అతని వికెట్ తీసుకోవడానికి బౌలర్లు అంతా చెమటోడుస్తున్నారు. మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా హైదరాబాద్ జట్టులో అల్లాడించే ప్రదర్శనలు చేస్తున్నాడు. ఇంకేముంది ఆస్ట్రేలియాకి టీ20 వరల్డ్ కప్ కి ఓపెనర్లు దొరికేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియాకి అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారు. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో వారికి మంచి అస్త్రాలు అని అంతా ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు అసలు ఫ్రేజర్ కు వరల్డ్ కప్ జట్టులో చోటే లేదు అంటున్నారు. అవును ట్రావిస్ హెడ్ చోటు మాత్రం పక్కాగా చెబుతున్నా.. జేక్ ఫ్రేజర్ కి మాత్రం ఆ ఛాన్స్ లేదు అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి. జేక్ ఫ్రేజర్ ఆటను తక్కువ చేయడం కాదు గానీ.. వారికి టాపార్డర్ స్పాట్స్ ఇప్పటికే ఫిల్ అయ్యాయి అంటున్నారు. పైగా ఐపీఎల్ ప్రదర్శనను బేస్ చేసుకుని జట్టులో స్థానం ఇవ్వలేము అంటున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా టాపార్డర్ కోసం డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మార్ష్ వారికి ఉన్న ప్రధాన్యతగా చెప్తున్నారు.
ట్రావిస్ హెడ్ ఐపీఎల్లో కూడా అదరగొడుతున్నాడు. అలాగే డేవిడ్ వార్నర్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ఇంక మార్ష్ ని కెప్టెన్ ని కూడా చేస్తారని చెప్తున్నారు. జేక్ ఫ్రేజర్ కు ఇంకా మంచి భవిష్యత్ ఉందని.. అతను ఇంకా అంత అనుభవం సంపాదించుకోలేదని చెప్తున్నారు. మొత్తానికి జేక్ ఫ్రేజర్ కి జట్టులో చోటు ఉండదు అనేది మాత్రం కచ్చితంగా వినిపిస్తున్న మాట. జేక్ ఫ్రేజర్ విషయంలో ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. ఫ్రేజర్ లాంటి ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ విషయంలో సాహసం చేస్తోంది అంటున్నారు. మరి.. జేక్ ఫ్రేజర్ కు అవకాశం ఇవ్వకపోవడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.