Nidhan
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే టీమ్‌లో ప్లేస్ పక్కా అనుకున్న చాలా మంది ఆటగాళ్లకు సెలెక్టర్ల నుంచి మొండిచెయ్యి ఎదురైంది. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే టీమ్‌లో ప్లేస్ పక్కా అనుకున్న చాలా మంది ఆటగాళ్లకు సెలెక్టర్ల నుంచి మొండిచెయ్యి ఎదురైంది. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Nidhan
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. బోర్డు సెక్రటరీ జై షాతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తదితరులు ఇవాళ ఓ హోటల్లో సమావేశం అయ్యారు. ఆ తర్వాత 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించారు. పెద్దగా సంచలనాలకు అవకాశం ఇవ్వకుండా మొదటి నుంచి వినిపిస్తున్న పేర్లనే సెలెక్షన్‌లోకి తీసుకున్నారు. ఐపీఎల్-2024లో సెన్సేషనల్ పెర్ఫార్మెన్సెస్తో దుమ్మురేపిన చాలా మంది స్టార్లను బోర్డు పెద్దలు పట్టించుకోలేదు. టీమ్‌లో ప్లేస్ పక్కా అనుకున్న చాలా మంది ఆటగాళ్లకు సెలెక్టర్ల నుంచి మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ కప్ బెర్త్ మిస్సయిన టీమిండియా స్టార్లు చాలా మంది ఉన్నారు. అందులో 11 మందిని మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్స్‌గా చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్లో రఫ్ఫాడించినా, తమ పెర్ఫార్మెన్స్తో అందర్నీ ఆకట్టుకున్నా వాళ్లకు విండీస్‌కు వెళ్లే ఛాన్స్ దక్కలేదు. ఈ అన్‌లక్కీ ప్లేయర్లతో ఓ జట్టును తయారు చేయొచ్చు. ఈ మధ్య టీమిండియా ఆడే టీ20 సిరీస్‌ల్లో రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్న డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు పొట్టి కప్పులో పాల్గొనే ఛాన్స్ రాలేదు. ఐపీఎల్లో బ్యాట్‌తో దుమ్మురేపినా అతడ్ని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఎస్ఆర్హెచ్కు ఫైరింగ్ స్టార్ట్స్ ఇస్తూ, విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్న అభిషేక్ శర్మనూ బోర్డు పెద్దలు విస్మరించారు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో కీలకంగా మారిన శుబ్‌మన్ గిల్‌కు వరల్డ్ కప్ మెయిన్ టీమ్‌లో చోటు దక్కలేదు.
రిజర్వ్డ్ ప్లేయర్స్‌లో ఒకడిగా ప్రపంచ కప్‌కు వెళ్లనున్నాడు గిల్. ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్న తిలక్ వర్మకూ మొండిచెయ్యే ఎదురైంది. తెలుగోడిని బీసీసీఐ రిజర్వ్డ్ ప్లేయర్‌గా కూడా తీసుకోలేదు. వీళ్లే కాదు.. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌నూ బోర్డు విస్మరించింది. అతడికి బదులు సంజూ శాంసన్‌ను టీమ్‌లోకి తీసుకుంది. పించ్ హిట్టర్ రింకూ సింగ్‌కు మెయిన్ టీమ్‌లో చోటు దక్కలేదు. ఆఖర్లో వస్తూ మ్యాచ్‌లు ఫినిష్ చేసే రింకూకు అన్యాయం జరిగింది. ఈ ఐపీఎల్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో మ్యాజిక్ చేస్తున్న దినేష్ కార్తీక్, బౌలింగ్‌లో అదరగొడుతున్న నటరాజన్, సందీప్ శర్మ, ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్‌ను కూడా సెలెక్టర్లు పక్కనబెట్టడం గమనార్హం.