iDreamPost
android-app
ios-app

KKR తరుపున బ్యాటింగ్ లో నరైన్ సూపర్ రికార్డు! మహా మహా హిట్టర్స్ వల్లే కాలేదు

KKR vs PBKS- Sunil Narine: ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ టీమ్ కు సాధ్యం కాని ఒక అరుదైన ఫీట్ ను సాధించింది. అలాగే సునీల్ నరైన్ కూడా ఓ అద్భుతం సృష్టించాడు.

KKR vs PBKS- Sunil Narine: ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ టీమ్ కు సాధ్యం కాని ఒక అరుదైన ఫీట్ ను సాధించింది. అలాగే సునీల్ నరైన్ కూడా ఓ అద్భుతం సృష్టించాడు.

KKR తరుపున బ్యాటింగ్ లో నరైన్ సూపర్ రికార్డు! మహా మహా హిట్టర్స్ వల్లే కాలేదు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్– పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ లో చాలానే అద్భుతాలు జరిగాయి. కేకేఆర్ బ్యాటర్ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయినంత పనైంది. మొదటి ఓవర్ నుంచి గ్యాప్ లేకుండా రన్స్ బాదుతూనే ఉన్నారు. ముఖ్యంగా నరైన్, ఫిలిప్ సాల్ట్ అవుటయ్యే దాకా పంజాబ్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కానీ, ఆ తర్వాత కాస్త పరుగులు తగ్గాయి. నిజానికి వాళ్లు ఇంకో 4 ఓవర్లు ఉండి ఉంటే.. కేకేఆర్ ఈ నైట్ కచ్చితంగా 300 పరుగులు చేసేదేమో? ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ బాదిన బాదుడికి పంజాబ్ కింగ్స్ బౌలర్లు పరేషాన్ అయిపోయారు. ఎప్పుడు అవుటవుతాడా అని ఎదురుచూశారు.

ఈ సీజన్లో సునీల్ నరైన్ విజృంభణ ఆగడం లేదు. ప్రత్యర్థులు ఎవరైనా సరే తన బ్యాటుతో చెలరేగుతున్నాడు. ఈడెన్ గార్డెన్స్ లో నయా చరిత్ర లిఖించారు. ఇప్పటివరకు ఈడెన్ గార్డెన్స్ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో గానీ.. ఐపీఎల్ లో గానీ 250+ పరుగులు స్కోర్ చేయలేదు. తొలిసారి కేకేఆర్ ఆ ఫీట్ ని సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 261 పరుగులు చేశారు. ఈ స్కోర్ లో బిగ్ క్రెడిట్ సునీల్ నరైన్(71), ఫిలిప్ సాల్ట్(75)లకే దక్కుతుంది. వాళ్లిద్దుర ఆడిన భారీ ఇన్నింగ్స్ తోనే కేకేఆర్ జట్టు పంజాబ్ కింగ్స్ ముంది కొండంత లక్ష్యాన్ని ఉంచగలిగింది. అలాగే ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ మరో అద్భుతం కూడా చేశాడు.

కేకేఆర్ తరఫున ఇప్పటి వరకు బ్యాటింగ్ చేసిన క్రికెటర్లలో చాలా మంది హేమా హేమీలు ఉన్నారు. వారిలో ఎంతో మందికి సాధ్యం కాని ఒక రికార్డును సునీల్ నరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. కేకేఆర్ తరఫున సిక్సర్లు కొట్టడంలో రాబిన్ ఉతప్ప(85), యూసుఫ్ పఠాన్(85) ఇద్దరినీ ఈ మ్యాచ్ తో దాటేశాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు 84 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్న సునీల్ నరైన్.. ఈ మ్యాచ్ లో కొట్టిన 4 సిక్సర్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. నరైన్ కంటే ముందు ఆండ్రూ రస్సెల్(201), నితీశ్ రానా(106) ఉన్నారు. నరైన్ ఇదే జోరును కొనసాగిస్తే.. కేకేఆర్ తరఫున ఉన్న ఎన్నో రికార్డులను ఈజీగా తుడిచిపెట్టేస్తాడు.

ఇంక ఈ మ్యాచ్ సమురీ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కానీ, బౌలింగ్ లో పంజాబ్ జట్టు ఘోరంగా విఫలమైంది. సాల్ట్(75), నరైన్(71), వెంకటేశ్ అయ్యర్(39), రస్సెల్(24), శ్రేయాస్ అయ్యర్(28), రింకూ సింగ్(5), రమన్ దీప్ సింగ్(5*) పరుగులు చేశారు. పంజాబ్ బౌలింగ్ చూస్తే అర్షదీప్ ఒక్కడే 2 వికెట్లు తీసుకుని పర్వాలేదు అనిపించాడు. సామ్ కరణ్, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. మొత్తానికి ఈడెన్ గార్డెన్స్ లో కేేకేఆర్, సునీల్ నరైన్ చరిత్ర సృష్టించేశారు.