Nidhan
క్రికెట్లో ఔట్ల విషయంలో మరింత కచ్చితత్వం కోసం డీఆర్ఎస్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాన్నాళ్లు అవుతున్నా ఇప్పటికీ చాలా టీమ్స్‌కు రివ్యూను సరిగ్గా వాడటం తెలియట్లేదు. దానికి మరో ఎగ్జాంపుల్‌గా బంగ్లాదేశ్‌ను చెప్పొచ్చు.
క్రికెట్లో ఔట్ల విషయంలో మరింత కచ్చితత్వం కోసం డీఆర్ఎస్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాన్నాళ్లు అవుతున్నా ఇప్పటికీ చాలా టీమ్స్‌కు రివ్యూను సరిగ్గా వాడటం తెలియట్లేదు. దానికి మరో ఎగ్జాంపుల్‌గా బంగ్లాదేశ్‌ను చెప్పొచ్చు.
Nidhan
క్రికెట్లో ఔట్ల విషయంలో మరింత కచ్చితత్వం కోసం డీఆర్ఎస్ సిస్టమ్‌ను ఐసీసీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంపైర్ నిర్ణయం నచ్చకపోతే బౌలింగ్, బ్యాటింగ్ టీమ్స్ రివ్యూ తీసుకోవచ్చు. దీని వల్ల అందరికీ ప్రయోజనమే. ఔట్స్ విషయంలో అంపైర్లు మరింత కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకునేందుకు, మరింత ఫోకస్డ్గా ఉండేందుకు ఇది హెల్ప్ అవుతోంది. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాన్నాళ్లు అవుతున్నా ఇప్పటికీ చాలా టీమ్స్‌కు రివ్యూను సరిగ్గా వాడటం తెలియట్లేదు. ఎంఎస్ ధోని లాంటి ఒకరిద్దరు తప్పితే డీఆర్ఎస్లో ఆరితేరిన వాళ్లు వరల్డ్ క్రికెట్లో చాలా తక్కువనే చెప్పాలి. ఎలాంటి ఔట్ల విషయంలో రివ్యూ తీసుకోవాలో అర్థం కాక దాన్ని వృథా చేసుకోవడం ఎక్కువైంది. దానికి మరో ఎగ్జాంపుల్‌గా బంగ్లాదేశ్‌ను చెప్పొచ్చు.
క్రికెట్ హిస్టరీలో వరస్ట్ డీఆర్ఎస్ తీసుకుంది బంగ్లాదేశ్. దీనికి కూడా రివ్యూ తీసుకుంటారా అని అందరూ షాకయ్యేలా చేసిందా జట్టు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భాగంగా బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షంటో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (29), కరుణరత్నే (60) బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ టైమ్‌లో బౌలింగ్‌కు దిగాడు తైజుల్ ఇస్లాం. అతడు వేసిన ఓవర్ ఐదో బంతిని డిఫెన్స్ చేశాడు మెండిస్. అయితే బంతి ప్యాడ్‌కు తాకిందని ఫిక్స్ అయిన బంగ్లా సారథి షంటో ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. బాల్ క్లియర్‌గా బ్యాట్‌కు తాకినా రివ్యూ దేనికో అర్థం గాక బౌలర్ తైజుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు. అయితే కెప్టెన్‌ను ఏమీ అనలేకపోయాడు.
థర్డ్ అంపైర్ రీప్లేలో చూడగా బాల్ బ్యాట్‌కు తాకిందని స్పష్టంగా తేలింది. దీంతో అంపైర్ నాటౌట్ అని ఇచ్చాడు. ఈ డీఆర్ఎస్ మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. సరిగ్గా బ్యాట్‌కు మధ్యలో తాకింది బాల్. ప్యాడ్‌కు, బాల్‌కు మధ్య చాలా దూరం ఉంది. అయినా షంటో రివ్యూ కోరడం ఏంటని షాకవుతున్నారు. ఇంతకంటే దారుణమైన రివ్యూ మరొకటి ఉండదని అంటున్నారు. కళ్లు కాకులు ఎత్తుకెళ్లాయా? దానికి ఎవరైనా డీఆర్ఎస్ తీసుకుంటారా? అని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే బంగ్లాదేశోళ్లు అంటార్రా బాబు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్‌కు మిగతా ప్లేయర్లు అయినా చెప్పాలి కదా.. దానికి కూడా రివ్యూ తీసుకుంటారా అని ఎగతాళి చేస్తున్నారు. మరి.. బంగ్లాదేశ్ డీఆర్ఎస్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCBలోకి రోహిత్ శర్మ.. కెప్టెన్సీ పగ్గాలు కూడా అతనికే!
THE GREATEST DRS IN CRICKET’S HISTORY…!!! 😂💥pic.twitter.com/po0wG3Mt4I
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2024