SRHతో కీలక మ్యాచ్.. 3 అరుదైన రికార్డులు నమోదు చేసిన ట్రెంట్ బౌల్ట్!

SRH vs RR- Trent Boult: సన్ రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 3 అరుదైన రికార్డులు నమోదు చేశాడు.

SRH vs RR- Trent Boult: సన్ రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 3 అరుదైన రికార్డులు నమోదు చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్ లో తలపడ్డాయి. చెన్నై వేదికగా రాజస్థాన్ రాయల్స్ తరఫున్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 3 అరుదైన రికార్డులు నమోదు చేశాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ ని దెబ్బ కొట్టడంలో బౌల్ట్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఎక్కడా కూడా తడబడకుండా పదునైన బంతులతో విజృంభించాడు. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల వికెట్లు వెంట వెటనే పడుతున్నా కూడా పరుగులు ఆగలేదు. బౌల్ట్ ని కూడా 3 ఓవర్లలో 32 పరుగులు కొట్టేశారు. కాకపోతే వికెట్లు తీయడంలో మాత్రం బౌల్ట్ ఎక్కడా తగ్గలేదు.

చెన్నై వేదికగా రాజస్థాన్ రాయల్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ అద్భుతం సృష్టించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి నుంచి కాస్త ఎక్స్ పెన్సివ్ గానే కనిపించింది. కానీ, జట్టులో ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మాత్రం అసలు మ్యాజిక్ చేసేశాడు. ఏకంగా 10 ఓవర్లలోపే 3 వికెట్లు తీసేశాడు. సన్ రైజర్స్ టాపార్డర్ లో అభిషేక్ శర్మ(12), రాహుల్ త్రిపాటి(37), అయిడెన్ మార్కరమ్(1) ముగ్గురిని పెవిలియన్ చేర్చి ఈ మ్యాచ్ లో హీరో అయిపోయాడు. సన్ రైజర్స్ ఉన్న ఫామ్, స్ట్రైక్ చూస్తే.. మళ్లీ భారీ స్కోర్ నమోదు చేస్తారని అంతా భావించారు. కానీ, బౌల్ట్ అడ్డుకట్ట వేసేశాడు.

ఈ మ్యాచ్ లో బౌల్ట్ నమోదు చేసిన రికార్డులు చూస్తే.. పవర్ ప్లేలో వంద వికెట్లకు పైబడి తీసిన ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. బౌల్ట్ ఇప్పటివరకు పవర్ ప్లేలో 101 వికెట్లు తీశాడు. బౌల్ట్ కంటే ముందు 118 వికెట్లతో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ ఉన్నాడు. టాప్ ప్లేస్ లో 128 వికెట్లతో డేవిడ్ విల్లీ ఉన్నాడు. ఇంక రెండో రికార్డు చూస్తే.. మోస్ట్ వికెట్స్ ఇన్ ఐపీఎల్ పవర్ ప్లే లిస్ట్ లో రెండో ప్లేస్ కి వచ్చేశాడు. 71 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ తొలి స్థానంలో ఉండగా.. బౌల్ట్ 62 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా బౌల్ట్ నిలిలాడు. ఇలా కీలక మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ హైదరాబాద్ టాపార్డర్ ని దెబ్బకొట్టి అరుదైన రికార్డులను నమోదు చేశాడు. మరి.. ట్రెంట్ సాధించిన ఘనతలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments