iDreamPost
android-app
ios-app

ముంబయి టీమ్ తో మ్యాచ్.. కెప్టెన్ కమ్మిన్స్ నయా రికార్డ్..

SRH vs MI- Pat Cummins: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో హైదరాబాద్ టీమ్ అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముంబయి మీద జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ కమ్మిన్స్ విజృంభించాడు.

SRH vs MI- Pat Cummins: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో హైదరాబాద్ టీమ్ అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముంబయి మీద జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ కమ్మిన్స్ విజృంభించాడు.

ముంబయి టీమ్ తో మ్యాచ్.. కెప్టెన్ కమ్మిన్స్ నయా రికార్డ్..

ఇండియన్ ప్రీమియర్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. గత సీసన్స్ తో పోలిస్తే మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్ అయ్యాక హైదరాబాద్ జట్టు ప్రాదర్శన కూడా మారింది. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్లో అయితే.. కమ్మిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆడటమే కాదు.. అరుదయిన రికార్డు కూడా సృష్టించాడు. కెప్టెన్ అనే పేరుకు అసలు సిసలైన అర్థాన్ని కమ్మిన్స్ చెప్పాడు. అలాగే హైదరాబాద్ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేసేలా కమ్మిన్స్ కష్టపడ్డాడు. ఈ పిఫార్మెన్స్ తో మంచి రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

వాంఖడే స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ – ముంబయి ఇండియన్స్ జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ కమ్మిన్స్ అద్భుతంగా రాణించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్ టీమ్ హైదరాబాద్ జట్టును బాగానే కట్టడి చేసింది. భారీ స్కోర్ కొట్టకుండా బౌలర్లు అడ్డుకున్నారు. టాపార్డర్ లో కేవలం ట్రావిస్ హెడ్(48) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్లంతా నామమాత్రపు స్కోర్ కె పెవిలియన్ చేరారు. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు స్కోర్ కనీసం 150 కూడా దాటాడు అనుకున్నారు. కానీ కెప్టెన్ కమ్మిన్స్ అప్పుడే అద్భుతం చేశాడు. బ్యాటుతో ముంబయి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా విజృంభించాడు. ప్యాట్ కమ్మిన్స్ లో ఉన్న భయంకరమైన బ్యాటర్ ను ముంబయి బౌలర్లకు పరిచయం చేశాడు .

ఈ మ్యాచ్ లో కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 35 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కమ్మిన్స్ అజేయంగా నిలవడం విశేషం. ఇంకో ఒక్క ఓవర్ ఉంటె కమ్మిన్స్ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకునేవాడు. మొత్తానికి ముంబయి బౌలర్లను గల్లీ ప్లేయర్స్ ని చేసి హైదరాబాద్ కెప్టెన్ కమ్మిన్స్ ఆడేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో కమ్మిన్స్ ఒక రికార్డు కూడా సృష్టించాడు. 9.. అంతకంటే తక్కువ డౌన్ బ్యాటింగ్ కి వచ్చి అత్యధిక స్కోర్ చేసిన జాబితాలో మూడో స్థానం(35)లో నిలిచాడు. ఈ జాబితాలో ఫస్ట్ హర్భజన్ (49*), రెండో ప్లేసులో కుల్దీప్(35*) ఉన్నారు. మొత్తానికి కమ్మిన్స్ కష్టంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగలిగింది. తక్కువ స్కోర్ లక్ష్యంతోనే బరిలోకి దిగిన ముంబై జట్టు.. తడబడింది. టాప్ ఆర్డర్ ఇషాన్ కిషన్(9), రోహిత్ శర్మ(4), నామం ధీర్(0) అయ్యారు. అయితే హైదరాబాద్ టీమ్ ఎక్స్ట్రాల రూపంలో 5 ఓవర్లు లోపే ఏకంగా 19 పరుగులు ఇచ్చింది. మరి.. కెప్టెన్ కమ్మిన్స్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.