Tirupathi Rao
SRH vs MI- Hardik Pandya Decissions: ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారుతోంది. హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. మరోవైపు హార్దిక్ పాండ్యా మాత్రం చెత్త కెప్టెన్ అపకీర్తిని మూటగట్టుకున్నాడు.
SRH vs MI- Hardik Pandya Decissions: ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారుతోంది. హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. మరోవైపు హార్దిక్ పాండ్యా మాత్రం చెత్త కెప్టెన్ అపకీర్తిని మూటగట్టుకున్నాడు.
Tirupathi Rao
ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ జట్టు 277 పరుగులు నమోదు చేసింది. ఇలా చరిత్ర తిరగరాయడంలో హైదరాబాద్ బ్యాటర్ల టాలెంట్ ఎంత ఉందో.. హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్ కూడా అలాగే ఉంది అంటున్నారు. ఈ స్కోర్ చూసిన తర్వాత హైదరాబాద్ జట్టును ఎంతగా పొగుడుతున్నారో.. అలాగే హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలకు అంతే తిడుతున్నారు. ఇలాంటి చెత్త కెప్టెన్సీని ఎక్కడా చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు హార్దిక్ పాండ్యా తీసుకున్న ఆ చెత్త నిర్ణయాలు ఏంటో చూద్దాం.
ఐపీఎల్ హిస్టరీలోనే హైదరాబాద్ జట్టు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అంతకంటే ముందే 10 ఓవర్లలోపు 148 పరుగులు నమోదు చేసింది. అలాంటి పరిస్థితి రావడానికి ముఖ్య కారణం హార్దిక్ పాండ్యానే. ఎందుకంటే ఈ మ్యాచ్ లో బౌలింగ్ ఎంచుకున్న విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుమ్రాలాంటి వరల్డ్ క్లాస్ టాప్ బౌలర్ ని జట్టులో పెట్టుకుని నాలుగో ఓవర్ కి బంతిని బుమ్రాకి ఇచ్చాడు. అప్పటి వరకు పరుగుల వరద పారించిన హైదరాబాద్ బ్యాటర్లకు బుమ్రా అడ్డుకట్ట వేశాడు. అప్పటికి టీమ్ స్కోర్ 45/0 పరుగులుగా ఉంది.
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తీసుకున్న బౌలింగ్ నిర్ణయాల వల్ల ఆ స్కోర్ కాస్తా మరో 6 ఓవర్లు ముగిసే సమయానికి 148/2కు చేరుకుంది. ఎవరైతే ఎక్స్ పెన్సివ్ గా మారారో వారికే బంతిని ఇస్తూ వచ్చాడు. బౌలర్ ని సిక్సులు కొడుతుంటే.. హార్దిక్ పాండ్యా గ్రౌండ్ లో ఉండి చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముంబయి జట్టును కొడుతూ ఉంటే బుమ్రాకి రెండో ఓవర్.. ఇన్నింగ్స్ లో 13వ ఓవర్ ని ఇచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికి మళ్లీ బుమ్రా స్కోర్ కార్డుకి అడ్డుకట్ట వేశాడు. మళ్లీ పాండ్యా తనదైనశైలిలో పరుగుల వరద పారేలా చేశాడు. అలా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ఒక్క బుమ్రానే 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చాడు.
𝗦𝗶𝗺𝗽𝗹𝘆 𝗯𝗿𝗶𝗹𝗹𝗶𝗮𝗻𝘁!
An all time IPL record now belongs to the @SunRisers 🧡
Scocrecard ▶️ https://t.co/oi6mgyCP5s#TATAIPL | #SRHvMI pic.twitter.com/eRQIYsLP5n
— IndianPremierLeague (@IPL) March 27, 2024
డెబ్యూడెంట్ మఫాకా అందరి కంటే అత్యధికంగా 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 66 పరుగులు ఇచ్చాడు. ఈ మొత్తం మ్యాచ్ లో ముంబయి బౌలర్లు అంతగా పరుగులు ఇస్తుంటే.. హైదరాబాద్ బ్యాటర్లు విజృంభిస్తుంటే.. హార్తిక్ పాండ్యా మాత్రం నవ్వుతూ కనిపించడం ముంబయి ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యా చిన్న పిల్లాడిలా చప్పట్లు కొడుతూ కనిపించాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ముంబయి కెప్టెన్ అయినందుకు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఈ చెత్త కెప్టెన్సీతో మరిన్ని విమర్శలను మూటగట్టుకుంటున్నాడు. బ్యాటింగ్ కి దిగిన ముంబయి జట్టు తొలుత కాస్త మెరుపులు మెరిపించినా కూడా తర్వాత అంతా తారుమారు అయ్యేలా కనిపిస్తోంది. 5 ఓవర్లలోనే ముంబయి జట్టు ఓపెనర్లను కోల్పోయింది. మరి.. హార్దిక్ పాండ్యా చెత్త నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The moment when @SunRisers created HISTORY!
Final over flourish ft. Heinrich Klaasen 🔥
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb
— IndianPremierLeague (@IPL) March 27, 2024