Nidhan
ఐపీఎల్-2024 ఆసాంతం విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కానీ కీలక మ్యాచ్‌లో మాత్రం దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. కేకేఆర్‌తో క్వాలిఫయర్-1లో మన టీమ్ బ్యాటర్లు అంచనాలను అందుకోలేకపోయారు.
ఐపీఎల్-2024 ఆసాంతం విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కానీ కీలక మ్యాచ్‌లో మాత్రం దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. కేకేఆర్‌తో క్వాలిఫయర్-1లో మన టీమ్ బ్యాటర్లు అంచనాలను అందుకోలేకపోయారు.
Nidhan
ఐపీఎల్-2024 ఆసాంతం విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కానీ కీలక మ్యాచ్‌లో మాత్రం దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో మన టీమ్ బ్యాటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆరెంజ్ ఆర్మీ 19.3 ఓవర్లు ఆడి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్ ఫెయిల్యూర్ టీమ్ కొంపముంచింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (3) విఫలమయ్యారు. నితీష్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0) కూడా త్వరగా పెవిలియన్‌కు చేరారు. ఈ టైమ్‌లో హెన్రిచ్ క్లాసెన్ (32)తో కలసి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55).
క్రీజులో ఉన్నంత సేపు స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ, ఎడాపెడా బౌండరీలు బాదుతూ పోయాడు త్రిపాఠి. 7 ఫోర్లు కొట్టిన అతడు.. ఓ భారీ సిక్స్ కూడా బాదాడు. ర్యాంప్ షాట్స్, స్విచ్ హిట్, రివర్స్ స్వీప్స్‌తో కేకేఆర్ బౌలర్లను భయపెట్టాడు. అలాంటోడు అబ్దుల్ సమద్ (16)తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. పరిగెత్తితే బతికిపోయేవాడు కానీ ఔట్ అవుతానని అనుకొని పిచ్ మధ్యలోనే ఆగిపోయాడు. ఆ టైమ్‌లో అతడు ఔట్ కాకపోతే టీమ్ స్కోరు ఈజీగా 200 దాటేది. హాఫ్ సెంచరీ తర్వాత మంచి ఊపు మీద ఉన్నప్పుడు రనౌట్ అవడంతో త్రిపాఠి బాధను తట్టుకోలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తూ మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉండిపోయాడు. ఈ హార్ట్ బ్రేకింగ్ సీన్ చూసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
MOST HEARTBREAKING PICTURE OF THE DAY. 💔
– Rahul Tripathi sitting in tears on the stairs. He’s absolutely devastated. You gave your best, Tripathi! ❤️ pic.twitter.com/bV1nhkzcjs
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2024