iDreamPost
android-app
ios-app

పగతో రగిలిపోతున్న SRH.. ఆ బౌలర్​పై ప్రతీకారం తీర్చుకునేందుకు లాస్ట్ ఛాన్స్!

  • Published May 25, 2024 | 8:06 PM Updated Updated May 25, 2024 | 8:06 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ పగతో రగిలిపోతోంది. ఫైనల్ ఫైట్​లో అతడి అంతు చూడాలనుకుంటోంది. అతడ్ని బాది పారేయాలని టీమ్ బ్యాటర్లంతా కసితో ఉన్నారు.

సన్​రైజర్స్ హైదరాబాద్ పగతో రగిలిపోతోంది. ఫైనల్ ఫైట్​లో అతడి అంతు చూడాలనుకుంటోంది. అతడ్ని బాది పారేయాలని టీమ్ బ్యాటర్లంతా కసితో ఉన్నారు.

  • Published May 25, 2024 | 8:06 PMUpdated May 25, 2024 | 8:06 PM
పగతో రగిలిపోతున్న SRH.. ఆ బౌలర్​పై ప్రతీకారం తీర్చుకునేందుకు లాస్ట్ ఛాన్స్!

ఐపీఎల్-2024 ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన సన్​రైజర్స్ హైదరాబాద్.. ప్లేఆఫ్స్​లోనూ అదే దూకుడును కొనసాగించలేకపోయింది. క్వాలిఫైయర్-2లో కోల్​కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఓడి ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది కమిన్స్ సేన. ఆ మ్యాచ్​లో అన్ని విభాగాల్లోనూ దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. దీంతో నిరాశలో ఉన్న ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడి మధ్య క్వాలిఫైయర్-2లో ఎలా ఆడతారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో అసలు సిసలైన గేమ్​ను బయటకు తీసుకొచ్చారు. అన్నింటా సంజూ సేనను డామినేట్ చేసి ఫైనల్ బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకున్నారు. రాజస్థాన్​ను 36 పరుగుల తేడాతో మట్టికరిపించిన ఎస్​ఆర్​హెచ్​.. తుదిపోరులో కేకేఆర్​తో అమీతుమీ తేల్చుకోనుంది.

కోల్​కతాతో జరిగే టైటిల్​ ఫైట్​లో గెలిచి కప్పును సొంతం చేసుకోవాలని సన్​రైజర్స్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచ్​లో నెగ్గడంతో కమిన్స్ సేనకు ఇంకో పని కూడా ఉంది. ఈ మ్యాచ్​తో కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది ఎస్​ఆర్​హెచ్. అతడు దొరికితే బాది పారేయాలని టీమ్ బ్యాటర్లు అంతా కాచుకొని ఉన్నారు. అతడి బౌలింగ్​లో కసిగా భారీ షాట్లు బాదాలని ఓపెనర్లు హెడ్, అభిషేక్ దగ్గర నుంచి కెప్టెన్ కమిన్స్ వరకు అంతా ఫిక్స్ అయ్యారు. సీజన్ మొదట్లో అతడు చేసిన అవమానానికి అంతకంతా బదులు తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇదే ఆఖరి ఛాన్స్ కాబట్టి హర్షిత్ పని పట్టాలని జట్టు ఆటగాళ్లు అందరూ కసిగా ఉన్నారు.

ఈ సీజన్ మొదట్లో ఎస్ఆర్​హెచ్-కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్​లో హర్షిత్ రాణా ఓవరాక్షన్ చేశాడు. మయాంక్ అగర్వాల్​ను ఔట్ చేశాక సన్​రైజర్స్ డగౌట్ వైపు ఫ్లయింగ్ కిస్​ ఇచ్చాడు. మయాంక్​ను కూడా అవమానించాడు. దీంతో అతడు దొరికితే బాదేయాలని ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లు ఫిక్స్ అయ్యారు. మొన్న క్వాలిఫైయర్స్​-1లో హర్షిత్ బౌలింగ్​లో 4 ఓవర్లలో 27 పరుగులే చేశారు. ఆ మ్యాచ్​లో మొదట్లోనే టాపార్డర్ బ్యాటర్లు ఔట్ అవడంతో రాణాను బాదడం కుదరలేదు. కానీ రేపు జరిగే ఫైనల్​లో మాత్రం అతడికి బడితపూజ చేయాలని ఆరెంజ్ ఆర్మీ ఆటగాళ్లు అనుకుంటున్నారు. గెలవడంతో పాటు అతడి మీద రివేంజ్ కూడా తీర్చుకొని ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారు. మరి.. ఎస్​ఆర్​హెచ్ రివేంజ్ స్టోరీపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.