Nidhan
ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్‌లో డామినేషన్ చూపించిన కోల్‌కతా ప్లేఆఫ్స్‌లోనూ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ గడప తొక్కింది. ఆ టీమ్ గెలుపులో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్‌లో డామినేషన్ చూపించిన కోల్‌కతా ప్లేఆఫ్స్‌లోనూ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ గడప తొక్కింది. ఆ టీమ్ గెలుపులో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు.
Nidhan
క్రికెట్లో ద్వైపాక్షిక టోర్నీల్లో నెగ్గడం కంటే ఐసీసీ టోర్నీల్లో నెగ్గడం చాలా కష్టమనే విషయం తెలిసిందే. వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలాంటి బిగ్ టోర్నమెంట్స్‌లో విజేతగా నిలవడం అంత ఈజీ కాదు. చాలా దేశాలను ఓడించి నాకౌట్, ఫైనల్ గండాన్ని దాటి కప్పు చేతబట్టడం అంటే మామూలు విషయం కాదు. చాలా మటుకు దేశాలు గ్రూప్ స్టేజ్‌లో అదరగొట్టినా నాకౌట్, ఫైనల్స్‌లో ఓడి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తాయి. కానీ ఆస్ట్రేలియా అలా కాదు.. ఒత్తిడిని చిత్తు చేయడం వాళ్లకు ఎంతో ఇష్టం. బిగ్ మ్యాచెస్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఆడటం వాళ్లకు అలవాటైన సంప్రదాయం. వరల్డ్ కప్ అనే కాదు.. ఐపీఎల్ లాంటి లీగ్స్, ఇతర బడా టోర్నీల్లోనూ ఆసీస్ ప్లేయర్లు ఇదే తరహాలో ఆడి సక్సెస్ అవుతున్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్‌తో పాటు నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ వికెట్లను పడగొట్టాడు. నితీష్, షాబాజ్‌ను వెంటవెంటనే ఔట్ చేసి మ్యాచ్‌ను కేకేఆర్ వైపు తిప్పాడు. ఈ సీజన్ మొత్తం దారుణంగా పెర్ఫార్మ్ చేసిన ఈ ఆసీస్ పేసర్.. కీలకమైన ప్లేఆఫ్స్ ఫైట్‌లో మాత్రం సత్తా చాటాడు. కోల్‌కతా తన మీద పెట్టిన 25 కోట్ల ధరకు న్యాయం చేశాడు. ఒంటిచేత్తో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. స్టార్క్ అనే కాదు.. నిన్నటి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ కూడా అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో 30 పరుగులు చేసి టీమ్‌ను కాపాడాడు. బౌలింగ్‌లోనూ 1 వికెట్ తీశాడు. వీళ్లు రాణించినా.. ఇంకో ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ ఒక్కడే ఫెయిలయ్యాడు.
ఇన్నాళ్లూ తుస్సుమన్న స్టార్క్.. క్వాలిఫయర్-1 చెలరేగడంతో అందరూ షాకవుతున్నారు. అయితే స్టార్క్, కమిన్స్ అనే కాదు.. దాదాపుగా అందరు కంగారూ క్రికెటర్లు నాకౌట్, ఫైనల్స్‌లో బాగా ఆడతారు. కీలకమైన బిగ్ మ్యాచెస్‌లో చెలరేగి ఆడటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి మ్యాచ్‌లు ఉంటే వాళ్ల శక్తులన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఆస్ట్రేలియా క్రికెటర్లకు స్మాల్ ఏజ్ నుంచే భయపడకుండా ఆడటం అలవాటు చేస్తారు. ఫియర్లెస్ అప్రోచ్ వాళ్ల రక్తంలో కలసిపోయేలా కోచింగ్ ఇస్తారు. అందుకే వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో ఆసీస్ పోతే గ్రూప్ దశలోనే బయటకు వెళ్లిపోతుంది. ఒకవేళ ప్రత్యర్థుల కర్మ కాలి నాకౌట్ దశకు చేరుకుందా కప్పు కొట్టనిదే వదలదు. అప్పటిదాకా విఫలమవుతూ వచ్చిన ఆటగాళ్లు కూడా శక్తులన్నీ తిరిగి పొందినట్లు అదరగొడతారు. ఆ మ్యాచ్‌ల్లో రాణించాలనే ఉత్సాహం, ప్రెజర్‌ను అవతలి వాళ్ల మీదకు నెట్టాలనే కసి, గెలవాలనే తపనే వాళ్లు అంతగా పెర్ఫార్మ్ చేయడానికి కారణాలుగా అనలిస్టులు చెబుతున్నారు. మరి.. కంగారూ క్రికెటర్లు బిగ్ మ్యాచెస్‌లో అదరగొట్టడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Mitchell Starc, You magician. 🔥 pic.twitter.com/hmfcDdmcnG
— Prayag (@theprayagtiwari) May 21, 2024