iDreamPost
android-app
ios-app

అభిషేక్ శర్మ విధ్వంసం.. యువరాజ్ ని గుర్తు చేస్తూ..

SRH vs DC- Abhishek Sharma: ఢిల్లీ- హైదరాబాద్ మ్యాచ్ లో మరోసారి హైదరాబాద్ విజృంభించింది. ఢిల్లీ బౌలర్లను వణికించేశారు. ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ జోడీ ఢిల్లీ బౌలర్లకు పీడకల మిగిల్చారు.

SRH vs DC- Abhishek Sharma: ఢిల్లీ- హైదరాబాద్ మ్యాచ్ లో మరోసారి హైదరాబాద్ విజృంభించింది. ఢిల్లీ బౌలర్లను వణికించేశారు. ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ జోడీ ఢిల్లీ బౌలర్లకు పీడకల మిగిల్చారు.

అభిషేక్ శర్మ విధ్వంసం.. యువరాజ్ ని గుర్తు చేస్తూ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ హోం గ్రౌండ్ లో ఆ టీమ్ పై హైదరాబాద్ ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆటకు ఢిల్లీ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోతోంది. కేవలం 5 ఓవర్లలోనే టీమ్ స్కోర్ 100 దాటేసింది. ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో కూడా చెలరేగి ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా అభిషేక్ శర్మ కూడా విజృంభించాడు. కేవలం 12 బంతుల్లోనే 46 పరుగులు పూర్తి చేసుకున్నాడు. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున మరోసారి అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ అర్ధ శతకాన్ని నమోదు చేయాల్సింది.

ఢిల్లీ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అసలైన పొట్టి క్రికెట్ మజాని అందించింది. ఈ మ్యాచ్ లో మరోసారి అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ విజృంభించడంతో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో పవర్ ప్లేలో ఏకంగా 125 పరుగులతో అద్భుతం సృష్టించారు. అంతే కాకుండా ఫాస్టెస్ట్ టీమ్ హండ్రెడ్ కూడా ఈ మ్యాచ్ లో నమోదు చేశారు. కేవలం 5 ఓవర్లలోనే టీమ్ స్కోర్ వంద దాటేసింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 ఓవర్లలోపు అత్యధిక స్కోర్ ని నమోదు చేసింది. ముంబయి మీద పది ఓవర్లలోపు 148 పరుగులు నమోదు చేసిన హైదరాబాద్ వారి రికార్డును బ్రేక్ చేసింది. ఢిల్లీ మీద మ్యాచ్ లో కేవలం 10 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి ఏకంగా 158 పరుగులు చేసింది.

మరోవైపు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసం అందరినీ ఆకట్టుకుంది. అభిషేక్ శర్మ ఒక్క అడుగులో హైదరాబాద్ జట్టు తరఫున వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 383 స్టైక్ రేట్ తో ఏకంగా 12 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. ఈ బ్యాటింగ్ చూసిన తర్వాత అంతా గురువుకి తగ్గ శిష్యుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువీ తన గురువు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. యువీని మైదానంలో మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి అభిషేక్ శర్మ ఆ లోటును తీరుస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ విజృంభిస్తుంటే.. అచ్చం యువరాజ్ ఆడుతున్నట్లే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అభిషేక్ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.