Nidhan
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఒకదాన్ని మించిన రేంజ్లో మరో నాక్ ఆడుతూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు.
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఒకదాన్ని మించిన రేంజ్లో మరో నాక్ ఆడుతూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు.
Nidhan
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఒకదాన్ని మించిన రేంజ్లో మరో నాక్ ఆడుతూ ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 14 మ్యాచుల్లో కలిపి 209 స్ట్రైక్ రేట్‌తో 467 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో టాప్-10లో నిలిచాడతను. మరో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (201) తప్పితే ఈ లిస్ట్‌లో ఉన్న ఒక్కరి స్రైక్ రేట్ కూడా అభిషేక్‌కు దగ్గర్లో లేదు. దీన్ని బట్టే ఈ సీజన్లో అతడి డామినేషన్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నీళ్లు తాగినంత అలవోకగా బౌండరీలు, సిక్సులు కొడుతున్నాడు అభిషేక్. ఈ సీజన్లో 40కి పైగా సిక్సులు బాదాడు. తద్వారా ఓ సీజన్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాంటి అభిషేక్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.
ఈ ఐపీఎల్ ఆసాంతం ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు అభిషేక్ శర్మ. నిన్న పంజాబ్ కింగ్స్ మీద కూడా 28 బంతుల్లోనే 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌండరీల కంటే సిక్సులు ఎక్కువగా కొడుతున్న అభిషేక్.. ఉన్నంత సేపు పరుగుల వరద పారిస్తున్నాడు. అతడి టాలెంట్‌కు ఫిదా అయిన బీసీసీఐ వరల్డ్ కప్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైందని క్రికెట్ వర్గాల సమాచారం. ప్లాన్ ప్రకారమే అతడ్ని అమెరికా గడ్డ మీద దించబోతున్నారని తెలుస్తోంది. ఓపెనర్‌గా వచ్చి ఎలాంటి భయం లేకుండా భారీ షాట్లు బాదుతూ స్కోరు బోర్డును బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిస్తున్న అభిషేక్ సామర్థ్యం బోర్డుతో పాటు సెలెక్టర్లు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా ఇంప్రెస్ చేసిందట. అందుకే ప్రపంచ కప్ స్క్వాడ్‌లో అతడికి చోటు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని వినిపిస్తోంది.
మే 25వ తేదీ వరకు వరల్డ్ కప్ స్క్వాడ్‌లో మార్పుచేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చివరగా స్క్వాడ్‌లో అభిషేక్ పేరును జోడించి ఫైనలైజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఓపెనర్‌గా అభిషేక్ ఇదే స్థాయిలో అదరగొడితే టీమిండియాకు ఎదురుండదని, అందుకే జట్టులోకి అతడ్ని తీసుకోవడం పక్కా అని అంటున్నారు. ఓపెనర్‌గా టీమ్‌లో చోటు దక్కించుకున్న యశస్వి జైస్వాల్ ఐపీఎల్లో అంతగా ఆకట్టుకోలేదు. లెఫ్టాండర్ అయిన అభిషేక్ దూకుడు మంత్రంతో వేగంగా పరుగులు చేయడం, అటు జైస్వాల్ ఫెయిల్ అవడంతో అతడికి బదులు ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్‌ను రీప్లేస్ చేస్తారని సమాచారం. కుదిరితే జైస్వాల్ స్థానంలో తీసుకోవడం లేదా రిజర్వ్డ్ ఆటగాళ్లలో ఒకడిగానైనా వరల్డ్ కప్‌కు మాత్రం అభిషేక్ వెళ్లడం ఖాయమనే పుకార్లు వస్తున్నాయి. మరి.. పొట్టి కప్పుకు అభిషేక్ వెళ్తే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
We didn’t get any proper left-handed prodigy after Yuvraj Singh’s retirement.
He can’t play cricket for a lifetime but he worked on Abhishek Sharma and taught him all his skills.
If he is able to achieve even 50 percent of him then we should feel lucky.pic.twitter.com/ccsH9n7X4Y
— Sujeet Suman (@sujeetsuman1991) May 19, 2024