iDreamPost
android-app
ios-app

ఒకరు అనుకుని మరొకరిని తప్పుగా కొన్న పంజాబ్! ఆ తప్పే అదృష్టం అయ్యింది!

  • Published Mar 26, 2024 | 6:09 PM Updated Updated Mar 26, 2024 | 6:17 PM

Shashank Singh, Punjab Kings, IPL 2024: వేలంలో జరిగిన పొరపాటు వల్ల ఓ ఆటగాడు పంజాబ్‌ టీమ్‌లోకి వచ్చాడు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆ జట్టుకు వరంగా మారాడు. ఆ ఆటగాడు ఎవరు? ఏంటో ఇప్పుడు చూద్దాం..

Shashank Singh, Punjab Kings, IPL 2024: వేలంలో జరిగిన పొరపాటు వల్ల ఓ ఆటగాడు పంజాబ్‌ టీమ్‌లోకి వచ్చాడు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆ జట్టుకు వరంగా మారాడు. ఆ ఆటగాడు ఎవరు? ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 26, 2024 | 6:09 PMUpdated Mar 26, 2024 | 6:17 PM
ఒకరు అనుకుని మరొకరిని తప్పుగా కొన్న పంజాబ్! ఆ తప్పే అదృష్టం అయ్యింది!

ఐపీఎల్‌ 2024లో భాగంగా సోమవారం బెంగళూరలోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. చివరి ఓవర్‌ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ ఆటగాడు సంచలన బ్యాటింగ్‌ చేశాడు. ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఆ బ్యాటర్‌ పేరు శశాంక్‌ సింగ్‌. ఈ 32 ఏళ్ల బ్యాటర్‌ను ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం 2023 డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో ఈ శశాంక్‌ సింగ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ పొరపాటున కొనుగోలు చేసింది. కానీ, ఇప్పుడు అతనే వాళ్లకు ఒక స్ట్రాంగ్‌ ప్లేయర్‌లా కనిపిస్తున్నాడు.

ఐపీఎల్‌ వేలం సందర్భంగా పంజాబ్‌ కింగ్స్‌ ఓనర్‌ ప్రీతిజింటా 19 ఏళ్ల శశాంక్‌ సింగ్‌ను కొనబోయి.. పొరపాటున ఈ 32 ఏళ్ల శశాంక్‌ సింగ్‌ను కొనుగోలు చేసింది. కొనేసిన తర్వాత పొరపాటు గుర్తించినా కూడా.. ఈ శశాంక్‌ తన లిస్ట్‌లో ఉన్నాడంటూ పంజాబ్‌ మేనేజ్‌మెంట్‌ తమ పొరపాటును కవర్‌ చేసుకుంది. ఈ శశాంక్‌ సింగ్‌ను 2019లో రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. 2020 సీజన్‌లో కూడా కొనసాగించింది. అయితే.. రెండు సీజన్లలో కూడా అతనికి ఆడే అవకాశం రాలేదు. అయితే.. 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20 లక్షల బ్రేస్‌ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. 2022 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన శశాంక్‌ కేవలం 69 పరుగులు చేసి దారుణంగా నిరాశపర్చాడు.

ఐపీఎల్‌ 2023లో పొరాపాటున పంజాబ్‌ టీమ్‌లోకి వచ్చాడు. కానీ, ఆర్సీబీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 19 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది. ఇది పెద్ద స్కోర్‌ కాదు. ఇక చివరి ఓవర్‌ వేసేందుకు ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ వచ్చాడు. అతని ఓవర్‌లో తొలి బంతికి సిక్స్‌, మూడో బంతికి సిక్స్‌, నాలుగో బంతికి ఫోర్‌ బాది.. పంజాబ్‌కు భారీ స్కోర్‌ అందించాడు. శశాంక్‌ వీర బాదుడితో ఆ ఒక్క ఓవర్‌లోనే పంజాబ్‌కు 20 రన్స్‌ వచ్చాయి. ఇలాంటి బ్యాటర్‌ను పొరపాటునా కొన్నా కూడా ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ హ్యాపీగానే ఉంది. కానీ, మ్యాచ్‌ గెలిస్తే శశాంక్‌ ఆడిన ఇన్నింగ్స్‌కు ఇంకా పేరు వచ్చేంది. మరి పొరపాటున టీమ్‌లోకి వచ్చి 8 బంతుల్లో 21 పరుగులు చేసి అదరగొట్టిన శశాంక్‌ సింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.