iDreamPost
android-app
ios-app

వీడియో: క్రికెట్ చరిత్ర​లో విచిత్రమైన ఔట్.. ఇంతకంటే అన్​లక్కీ బ్యాటర్ ఉండడు!

  • Published Apr 08, 2024 | 7:17 PM Updated Updated Apr 08, 2024 | 7:17 PM

క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. వీటిలో చాలా మటుకు ఫన్నీగా ఉంటాయి. ఇలాంటి వాటికి సోషల్ మీడియాలోనూ వ్యూస్ అదిరిపోతాయి.

క్రికెట్​లో అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. వీటిలో చాలా మటుకు ఫన్నీగా ఉంటాయి. ఇలాంటి వాటికి సోషల్ మీడియాలోనూ వ్యూస్ అదిరిపోతాయి.

  • Published Apr 08, 2024 | 7:17 PMUpdated Apr 08, 2024 | 7:17 PM
వీడియో: క్రికెట్ చరిత్ర​లో విచిత్రమైన ఔట్.. ఇంతకంటే అన్​లక్కీ బ్యాటర్ ఉండడు!

క్రికెట్​ చాలా ఎంటర్​టైనింగ్ గేమ్ అనేది తెలిసిందే. ముఖ్యంగా టీ20 క్రికెట్ వచ్చాక ఈ ఆటలో వినోదం మరింత పెరిగింది. ఫోర్లు, సిక్సులతో బ్యాటర్లు విజృంభిస్తూ ఆడియెన్స్​కు కావాల్సినంత ఎంటర్​టైన్​మెంట్ అందిస్తున్నారు. అయితే ఆటగాళ్లు తమ పెర్ఫార్మెన్స్​లతో పాటు ఒక్కోసారి కొన్ని విచిత్రమైన ఘటనల ద్వారా కూడా వైరల్ అవుతుంటారు. ఇందులో పాకిస్థాన్ టీమ్ ఫస్ట్ ప్లేస్​లో ఉంటుంది. ఆ జట్టు ఆటగాళ్లు విచిత్రమైన విన్యాసాల ద్వారా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్​గా మారారు. మిస్ ఫీల్డింగ్​తో నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇప్పుడో ఇతర దేశం ఆటగాడు కూడా ఇలాగే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. అతడే షాహిద్ అఫ్రిదీ జూనియర్.

క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన ఔట్​కు వెస్టన్ షెఫీల్డ్ టోర్నీ వేదికైంది. ఆ టోర్నీలో భాగంగా టీమ్ యూరప్, బ్రిటిష్ అండ్ ఐరిష్ నైట్స్ టీమ్స్ మధ్య టీ10 మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టీమ్ యూరప్​ తరఫున బరిలోకి దిగిన షాహిద్ అఫ్రిదీ జూనియర్ మంచి ఊపు మీదున్నాడు. 4 బంతులు ఎదుర్కొన్న అతడు 14 పరుగులు చేశాడు. దొరికిన బాల్​ను దొరికినట్లు బౌండరీకి తరలించాడు. బ్రిటిష్ నైట్స్​ను భయపెట్టిన అఫ్రిదీ భారీ ఇన్నింగ్స్​ ఆడటం పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఆ సమయంలో విచిత్రంగా ఔట్ అయ్యాడతను. రిలే ఓవర్​లో రెండో బంతికి బిగ్ షాట్​కు ప్రయత్నించాడు అఫ్రిదీ. అయితే షాట్ ఆడే క్రమంలో అతడి బ్యాట్ విరిగిపోయింది. హ్యాండిల్ బ్యాటర్ చేతిలో ఉండిపోగా.. మిగిలిన భాగం ఊడిపోయి లెగ్ సైడ్ పడింది.

బ్యాట్ విరిగిందన్న షాక్​లో అఫ్రిదీ జూనియర్ ఉండగా.. అప్పటికే ఎడ్జ్ తీసుకున్న బాల్ గాల్లోకి లేచింది. అంతే బౌలర్ వచ్చి దాన్ని అందుకున్నాడు. అదే బంతికి బ్యాట్ విరగడం, క్యాచ్ ఔట్ అవడంతో బ్యాటర్​కు ఏదీ పాలుపోలేదు. కొద్దిసేపు క్రీజులోనే నిలబడి విరిగిన బ్యాట్​ను చూస్తూ నిరాశలో కూరుకుపోయాడు. ఆ తర్వాత అతడు పెవిలియన్​ బాట పట్టాడు. ఈ ఔట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. బ్యాట్ విరగడం అప్పుడప్పుడూ జరుగుతుందని కానీ విరిగాక ఔట్ అవడం మాత్రం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. క్రికెట్ చరిత్రలో ఇంతకంటే అన్​లక్కీ బ్యాటర్ మరొకరు ఉండరని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. షాహిద్ అఫ్రిదీ జూనియర్ ఔటైన తీరు మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.