రాజస్థాన్ పై కీలక మ్యాచ్.. అదరగొట్టిన క్లాసెన్.. అరుదైన ఘనత కూడా!

RR vs SRH- Heinrich Klaasen: రాజస్థాన్ రాయల్స్ తో కీలక మ్యాచ్ లో క్లాసెన్ కాకా అద్భుతంగా రాణించాడు. టీమ్ మొత్తం ఒకెత్తు అయితే క్లాసెన్ మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే ఒక రికార్డు కూడా నమోదు చేశాడు.

RR vs SRH- Heinrich Klaasen: రాజస్థాన్ రాయల్స్ తో కీలక మ్యాచ్ లో క్లాసెన్ కాకా అద్భుతంగా రాణించాడు. టీమ్ మొత్తం ఒకెత్తు అయితే క్లాసెన్ మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే ఒక రికార్డు కూడా నమోదు చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో క్వాలిఫయర్లో జట్టు మొత్తం తడబడుతున్న తరుణంలో క్లాసెన్ కాకా వీరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. క్లాసెన్ చెలరేగడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ దక్కడమే కాకుండా.. ఫైట్ చేసే స్కోప్ లభించింది. అంతేకాకుండా క్లాసెన్ ఈ మ్యాచ్ లో ఒక క్రేజీ రికార్డు కూడా బద్దులు కొట్టాడు. సొంత టీమ్మేట్ అభిషేక్ శర్మ పేరిట ఉన్న ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సీజన్లో ఇంక ఆ రికార్డు క్లాసెన్ పేరిటే ఉండే అవకాశం కనిపిస్తోంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ని కట్టడి చేయడంలో సఫలీకృతమైంది. అంతేకాకుండా జట్టు తక్కువ స్కోర్ కే పరిమింత చేసేసింది. నిజానికి హైదరాబాద్ జట్టు 200 దాటించేస్తారు అనుకుంటే.. 180 పరుగులు కూడా కొట్టకుండా ఆపేసింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటింగ్ చూస్తే.. ట్రావిస్ హెడ్(34), అభిషేక్ శర్మ(12), త్రిపాటి(37), క్లాసెన్(50), మార్కరమ్(1), నితీశ్ రెడ్డి(5), అబ్దుల్ సమద్(గోల్డెన్ డక్), షబాజ్ అహ్మద్(18), కెప్టెన్ కమ్మిన్స్(5), ఉనద్కట్(5) పరుగులు చేశారు.

అంతా సో.. సోగా బ్యాటింగ్ చేస్తే క్లాసెన్ మాత్రం ఒక పార్టనర్ షిప్ బిల్డ్ చేసుకుంటూ.. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో టీమ్ కి ఏ కావాలో అలాగే ఆడాడు. ఏ బాల్ ని కొట్టాలి, ఏ బాల్ వదిలేయాలి అనే విషయాన్ని బాగా ఫాలో అయ్యాడు. క్లాసెన్ బ్యాటింగ్ లో చూపించిన డిసిప్లైన్ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా క్లాసెన్ ఈ మ్యాచ్ లో ఒక అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు. అందుకోసం అభిషేక్ శర్మ రికార్డును బద్దలు కొట్టేశాడు. ఆ క్రేజీ రికార్డు ఏంటంటే.. ఈ సీజన్లో స్పిన్ మీద అత్యధిక సిక్సులు నమోదు చేసిన ప్లేయర్ గా అవతరించాడు.

ఇంతక ముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ(22 సిక్సులు) పేరిట ఉంది. ఈ మ్యాచ్ లో క్లాసెన్ 23 సిక్సులు కొట్టేసి అభిషేక్ ని దాటేశాడు. ఇంక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చూస్తే.. అందరూ అదరగొట్టేశారు. ముఖ్యంగా బౌల్ట్ ఏకంగా 3 రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్- అవేశ్ ఖాన్లకు ఏకంగా 3 వికెట్లు చొప్పున దక్కాయి. అలాగే సందీప్ శర్మాకు రెండు వికెట్లు దక్కాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కంట్రోల్ చేయడంలో రాజస్థాన్ అయితే సక్సెస్ అయ్యింది. మరి.. క్లాసెన్ కాకా ప్రదర్శన, ఆయన క్రియేట్ చేసిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments