iDreamPost
android-app
ios-app

RR vs MI: టాపార్డర్ విఫలం.. కానీ, ఆ విషయంలో మాత్రం రోహిత్ చాలా హ్యాపీ!

RR vs MI- Rohti Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి జట్టు అంతంత మాత్రం ప్రదర్శనతో నెట్టుకొస్తుందో. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టాపార్డర్ విఫలమైంది. కానీ, ఒక విషయంలో మాత్రం రోహిత్ శర్మ చాలా ఆనందంగా కనిపించాడు.

RR vs MI- Rohti Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబయి జట్టు అంతంత మాత్రం ప్రదర్శనతో నెట్టుకొస్తుందో. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టాపార్డర్ విఫలమైంది. కానీ, ఒక విషయంలో మాత్రం రోహిత్ శర్మ చాలా ఆనందంగా కనిపించాడు.

RR vs MI: టాపార్డర్ విఫలం.. కానీ, ఆ విషయంలో మాత్రం రోహిత్ చాలా హ్యాపీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జైపూర్ వేదికగా ముంబయి- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఎంఐ ప్రదర్శన అంతంత మాత్రంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకు ముంబయి జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో రోహిత్ మాత్రమే కాదు.. సీనియర్స్, స్టార్లు మొత్తం విఫలమయ్యారు. రోహిత్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, నబి, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ ఇలా అంతా తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. ఇలాంటి తరుణంలో డగౌట్ లో ఉన్న రోహిత్ శర్మ కాస్త హ్యాపీగా కనిపించాడు. అదేంటి టీమ్ లో ప్లేయర్లు అవుటవుతుంటే.. రోహిత్ హ్యాపీ ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. రోహిత్ శర్మ ఆనందానికి అసలైన కారణం వేరే ఉంది.

ముంబయి ఇండియన్స్ కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చాలా ప్రత్యేక స్థానం ఉంది. 5 ట్రోఫీలను గెలిచిన ఘనత ఆ జట్టు సొంతం. గత కొన్ని సీజన్లుగా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఈ సీజన్లో కూడా హార్దిక్ సేన అంతగా ప్రభావం చూపలేకపోతోంది. పాయింట్స్ టేబుల్ లో 7వ స్థానంలో ఉంది. తాజాగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి జట్టు తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో టాపార్డర్ విఫలమైంది. కానీ, రోహిత్ మాత్రం చాలా ఆనందంగా కనిపించాడు. అయితే అలా ఎందుకు ఉన్నాడు? ముంబయి పరిస్థితి చూసి అలా ఆనంద పడుతున్నాడు అని కంక్లూజన్ కి రాకండి. టీమ్ లో ఉన్న కుర్రాళ్లు ఫామ్ లోకి వస్తున్నారని రోహిత్ శర్మ చాలా హ్యాపీగా కనిపించాడు.

సీనియర్లు, స్టార్లు అంతా విఫలమవుతున్న తరుణంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 65 పరుగులు చేశాడు. అలాగే ఇంకో కుర్రాడు నేహాల్ వధేరా 4 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో కేవలం 24 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అర్ధ శతకానికి అడుగు దూరంలో బౌల్ట్ బౌలింగ్ లో సందీప్ శర్మకు క్యాచ్ గా చిక్కి పెవిలియన్ కు చేరాడు. తిలక్ వర్మ, నేహాల్ వంటి కుర్రాళ్లు ముంబయి జట్టులో రాణించడం చూసి రోహిత్ శర్మ ఎంతో సంతోషంగా కనిపించాడు. ముంబయి జట్టు ఫ్యూచర్ కి ఎలాంటి ఢోకా లేదు అనే నమ్మకం రోహిత్ ముఖంలో కనిపించింది. ఒక్క రోహిత్ శర్మ మాత్రమే కాదు. ముంబయి జట్టు అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు ఇవాళ తిలక్ వర్మ, నేహాల్ ఆట తీరు చూసి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ తీసుకున్నా కూడా.. అతనికి మాత్రం ముంబయి జట్టు మీద ఎంతో గౌరవం అంటూ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.