iDreamPost

Rohit Sharma: నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నా! వరల్డ్ కప్ ముందు బాంబ్ పేల్చిన రోహిత్!

  • Published May 18, 2024 | 5:08 PMUpdated May 18, 2024 | 5:08 PM

టీ20 వరల్డ్ కప్-2024 మొదలవడానికి ఇంకో రెండు వారాల టైమ్ కూడా లేదు. ఈ టైమ్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బాంబు పేల్చాడు. తాను సరిగ్గా ఆడలేకపోతున్నానని అన్నాడు. హిట్​మ్యాన్ ఇంకా ఏం చెప్పాడంటే..!

టీ20 వరల్డ్ కప్-2024 మొదలవడానికి ఇంకో రెండు వారాల టైమ్ కూడా లేదు. ఈ టైమ్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బాంబు పేల్చాడు. తాను సరిగ్గా ఆడలేకపోతున్నానని అన్నాడు. హిట్​మ్యాన్ ఇంకా ఏం చెప్పాడంటే..!

  • Published May 18, 2024 | 5:08 PMUpdated May 18, 2024 | 5:08 PM
Rohit Sharma: నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నా! వరల్డ్ కప్ ముందు బాంబ్ పేల్చిన రోహిత్!

రోహిత్ శర్మ.. ఈ ఐపీఎల్​ సీజన్ మొదలవడానికి ముందు నుంచే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కెప్టెన్సీ మార్పు వివాదంతో అతడు ఈ సీజన్​లో ఆడతాడో లేదనే అనుమానాలు నెలకొన్నాయి. లీగ్ స్టార్ట్ అవడానికి ముందు ఆడనంటూ ట్వీట్ పెట్టి డిలీట్ చేశాడు. దీంతో హిట్​మ్యాన్​ ముంబై ఇండియన్స్​కు గుడ్​బై చెప్పేశాడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్​కు కొన్ని గంటల ముందు టీమ్​తో జాయిన్ అయ్యాడు రోహిత్. పాండ్యా గ్రూప్​కు దూరంగా ఉంటూ ఒంటరిగా ప్రాక్టీస్​ చేశాడు. కెప్టెన్సీ పోవడంతో అతడు బ్యాటర్​గా ఏం చేస్తాడని అంతా ఎదురుచూశారు. అభిమానులు ఆశించిన స్థాయిలో కాకపోయినా అతడి బ్యాట్ బాగానే గర్జించింది. ఐపీఎల్​-2024లో ముంబై తరఫున అత్యధిక పరుగులు, బౌండరీలు, సిక్సులు బాదింది రోహితే కావడం విశేషం.

ఈ సీజన్​లో ఆడిన 14 మ్యాచుల్లో 150 స్ట్రైక్ రేట్​తో 417 పరుగులు చేశాడు రోహిత్. అతడి ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. నిన్న లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​లో 38 బంతుల్లోనే 68 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ముంబై వరుస మ్యాచుల్లో ఓడినా హిట్​మ్యాన్ బ్యాటింగ్ చూసేందుకు వేలాదిగా స్టేడియాలకు పోటెత్తారు ఫ్యాన్స్. వాళ్లను అతడు నిరాశపర్చలేదు. అడపాదడపా మంచి ఇన్నింగ్స్​లు ఆడుతూ వచ్చాడు. కానీ ఈ విషయాన్ని హిట్​మ్యాన్ ఒప్పుకోవడం లేదు. అభిమానులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాలను నిలబెట్టుకోలేకపోయానని బాధపడుతున్నాడు. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాను అంటూ వరల్డ్ కప్ ముందు బాంబు పేల్చాడు. అనుకున్నంత స్థాయిలో తాను రాణించలేకపోయానంటూ తన పెర్ఫార్మెన్స్​ మీద అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే దీని గురించి అతిగా ఆలోచించడం మంచిది కాదన్నాడు రోహిత్.

‘ఒక బ్యాట్స్​మన్​గా నేను అంచనాలను అందుకోలేకపోయాననే విషయం నాకు తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఆడటం వల్ల ఒకటి మాత్రం నేర్చుకున్నా. సరిగా ఆడలేదని బాధపడుతూ కూర్చున్నా, అతిగా ఆలోచించినా మున్ముందు మ్యాచుల్లో బాగా ఆడలేం. అందుకే పాజిటివ్ మైండ్​సెట్​తో ఉండేందుకు ప్రయత్నిస్తుంటా. మంచిగా ఆలోచిస్తూ, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసేందుకు ట్రై చేస్తా. నా బ్యాటింగ్​లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏ విషయంలో తప్పులు చేస్తున్నానో అర్థం చేసుకొని వాటిని సరిదిద్దుకుంటా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. హిట్​మ్యాన్ వ్యాఖ్యలు విన్న ఫ్యాన్స్ అతడు బాగానే ఆడాడని, టీమ్​లోని ఇతర ఆటగాళ్లతో పోలిస్తే రోహిత్ చాలా బెటర్ అని అంటున్నారు. మరి.. ఐపీఎల్-2024లో హిట్​మ్యాన్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి